Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి తమన్నా. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకొని తెలుగులో మాత్రమే కాకుండా.. తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అందుకున్నారు. ఇలా తమన్నా ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు 18 సంవత్సరాల కాలం పూర్తవుతోంది.
Advertisement
ఇప్పటికి ఏమాత్రం అవకాశాలు కోల్పోకుండా తెలుగు, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రాలు కూడా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి ఈమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా హీరోయిన్ గా కొనసాగుతూనే ఉన్నారు. అయితే ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక వీరి ప్రేమ విషయాన్ని దాచుకోకుండా అందరి ముందు తమ రిలేషన్ గురించి బయట పెట్టారు. ఇక వీరి రిలేషన్ తెలియజేసిన అనంతరం వీరిద్దరూ ఎంచక్కా వెకేషన్లకు వెళ్తూ తమ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
Advertisement
ప్రేమలో ఉన్నటువంటి తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ ఈమె ప్రేమ గురించి రక రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలను మాత్రం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. తాజాగా మరోసారి తమన్నా పెళ్లి గురించి మాట్లాడుతూ.. చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు పెళ్లిపై ఎంతో నమ్మకం ఉందని తెలిపారు. తాను కూడా ఒకానొక సమయంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. అయితే ఆ సమయంలోనే తనకు సినిమా అవకాశాలు కూడా ఎక్కువగా రావడంతో పెళ్లి ఆలోచనకు పులిస్టాప్ పెట్టి తిరిగి కెరీర్ పై ఫోకస్ చేశానంటూ.. తమన్నా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.