Advertisement
టాలీవుడ్ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ తన టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యారు. ఈరోజు ఆయనకీ ఉన్నంత ఫాలోయింగ్ మరే హీరోకి ఉండదు. హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా అభిమానులు ఆయనను ఆరాధిస్తూ ఉంటారు.
Advertisement
సినిమాల్లో టాప్ పొజిషన్ లో ఉండగానే ఆయన జనాలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వెళ్లారు. ఈ రంగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. ఇటు సినిమాలతోను, అటు రాజకీయాలతోను ఫుల్ బిజీగా ఉంటున్నారు, అయితే.. సినిమాల్లోకి రాకముందే పవన్ కళ్యాణ్ ఓ అమ్మాయిని ప్రేమించారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఈ విషయాలను తెలిపారు.
Advertisement
చెన్నైలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కంప్యూటర్ క్లాసులకు వెళ్లేవారట. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ క్లాస్ లో ఓ అమ్మాయి చాలా అందంగా ఉండేదట. ఆ అమ్మాయితో మాట్లాడాలని, ప్రేమలో పడేయాలని క్లాస్ లో ఇతర అబ్బాయిలు ప్రయత్నించారట. కానీ, ఆ అమ్మాయి మాత్రం పవన్ కళ్యాణ్ తో మాట్లాడడానికి మాత్రమే ఆసక్తి చూపించేదని తెలిపారు. దీనితో పవన్ స్నేహితులు ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తోంది.. నువ్వు వెళ్లి ప్రపోజ్ చెయ్యి అని పంపించడంతో పవన్ కళ్యాణ్ తన పాత కారుని రిపేర్ చేసి ఆ అమ్మాయిని ఎక్కించుకుని సిటీ మొత్తం తిరిగి తనకి నచ్చిన ఓ చోట ప్రపోజ్ చేశారట. ఆ అమ్మాయి మాత్రం పవన్ కళ్యాణ్ ను చెడామడా తిట్టి.. నువ్వెంటి నీ వయసు ఏంటి? అని తిట్టేసి వెళ్లిపోయిందని పవన్ తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మరిన్ని..
ఇస్రో సోలార్ మిషన్ ఆదిత్య L-1 వెనుక ఉన్న శాస్త్రవేత్తలు, టెక్నిషియన్స్ జీతాలు ఎంతో తెలుసా?
“ప్రభాస్” ఆధార్ కార్డు లీక్.. అందులో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు!
తాను చనిపోతూ మరో నలుగురికి జీవితాన్నిచ్చింది.. ఈమె గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు!