Advertisement
బామ్మ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినా నిర్మలమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు తరంలో అమ్మ పాత్రలో నటించి మెప్పించారు నిర్మలమ్మ. ఇక చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, సుమన్ వంటి హీరోల సినిమాలలో బామ్మ పాత్ర అంటే నిర్మలమ్మ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకానొక సమయంలో తెలుగు ప్రేక్షకులలో ఆమెకు ఉన్న క్రేజ్ ఆమె కోసం దర్శకనిర్మాతలు నిర్మలమ్మ డేట్స్ కోసం క్యూలో ఎదురుచూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే నిర్మలమ్మ హీరోయిన్లతో సమానంగా పారితోషికం అందుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే బామ్మ పాత్రలో నిర్మలమ్మ హీరోతో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది.
Advertisement
1920 జూలై 18న మచీలీపట్నంలో జన్మించారు నిర్మలమ్మ . 1943లో గరుడ గర్బభంగం అనే సినిమాలో వెండితెరకు పరిచయమయ్యారు. నిర్మలమ్మ 1961లో ‘కృష్ణప్రేమ’ అనే చిత్రంలో రుక్మిణి పాత్రని దక్కించుకుంది. ఆ సినిమా తర్వాతే ఆమెకు అవకాశాలు పెరిగాయి. నిర్మలమ్మ సుమారు 1000కి పైగా సినిమాల్లో నటించి రికార్డ్ సృష్టించారు. చివరగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమకు స్వాగతం’లో నిర్మలమ్మ నటించారు. ఇక ఆ తర్వాత వయసు రీత్యా సినిమాలకు దూరమయ్యారు.
దాదాపు రెండు తరాల ప్రేక్షకులను అలరించి, అందరికీ దగ్గరైన నిర్మలమ్మ ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా ఎంతో గొప్ప మనసున్న వ్యక్తిగా నిర్మలమ్మ పేరు తెచ్చుకున్నారు. ఎందుకంటే తన ఇంటికి ఆకలితో వచ్చినా వారికి కాదనకుండా కడుపు నింపేవారు నిర్మలమ్మ . అలాంటి మంచి వ్యక్తి చివరి రోజుల్లో ఎన్నో కష్టాలను అనుభవించి అందరూ ఉన్న అనాథగా మరణించారు. ఇంతకీ ఆమె చివరి రోజులలో ఏం జరిగిందంటే..?
Advertisement
నిర్మలమ్మ పర్సనల్ లైఫ్ కొంచెం విషాదాంతంగా ముగిసింది. ఆమె ఎవరినీ పెళ్లి చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. కవిత అనే అమ్మాయిని దత్తత తీసుకొని పెంచారు. అలాగే మరికొందరికి సాయం చేస్తూ వారి ఎదుగుదలకు సహకరించారు. సినిమాల నుంచి బయటకు వచ్చేసే సమయంలో నిర్మలమ్మ డయాబెటిస్ తో బాధపడేవారట. కానీ ఈ విషయాన్ని ఆమె నా అనుకునే వారు ఎవరు పట్టించుకోలేదు. ఇక నిర్మలమ్మ సాయంతో పెరిగి పెద్దయి జీవితంలో ఎదిగినవారు కూడా ఆమె బాగోగులు చూసుకోలేదు.
ఆత్మాభిమానంతో నిర్మలమ్మ తన ఆరోగ్య విషయాలను ఎవరికీ చెప్పేవారు కాదట. ఇక నిర్మలమ్మ గురించి సినీ ఇండస్ట్రీకి చెందినవారు సైతం పెద్దగా ఆలోచించలేదు. ఇంకా తన చివరి రోజుల్లో ఎంతో మదన పడుతూ ఉండేవారట. తనను ఎవరూ పట్టించుకోలేదనే మనో వ్యధతో చివరికి 2009 ఫిబ్రవరి 19న కన్నమూశారు. నిర్మలమ్మ సాధారణంగానే వయసు పెద్దవ్వడంతో మరణించారని అందరూ అనుకున్నారు. కానీ ఆమెను ఆదరించలేక మనోవ్యధతో మరణించినట్లు ఆమెకు సన్నిహితంగా ఉన్న కొందరు ఆ తరువాత ఈ పరీక్షను బయటపెట్టారు.
ఇది కూడా చదవండి:
ఉదయనిధి స్టాలిన్ పై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు..!
పల్లవి ప్రశాంత్ కి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?
కృష్ణుడు పాత్రలో మెప్పించిన.. 16 మంది టాలీవుడ్ హీరోలు వీళ్ళే..!