Advertisement
విజయ్ దేవరకొండ తన కెరీర్‌ని చిన్న చిన్న పాత్రలతో ప్రారంభించాడు. సినిమా సినిమాకి స్టార్డం పెంచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు . తన యాటిట్యూడ్, స్పీచ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక వ్యక్తిగతంగా కూడా చాలాసార్లు విజయ్ దేవరకొండ తన గొప్ప మనసుని చాటుకున్నాడు. అనేక సహాయ కార్యక్రమాల్లో ఆయన కూడా తన వంతు సాయం చేస్తారు. ఇటీవల వైజాగ్‌లో జరిగిన ఖుషి సక్సెస్ మీట్లో.. 100 మంది అభిమానుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ప్రకటించారు. తాజాగా ఓ ప్రొడక్షన్ హౌస్ ఈ విషయంపై విజయ్ ని ఎగతాళి చేసి మాట్లాడడం ప్రస్తుతం వివాదంగా మారింది.
Advertisement
వందమందికి సహాయం చేయడంపై అభిషేక్ పిక్చర్స్ విజయ్ కు ఓ ట్వీట్ చేసింది. అసలు విషయం ఏంటంటే… విజయ్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా తెరకెక్కింది. 2020లో విడుదలైన ఈ అభిషేక్ పిక్చర్స్ పంపిణీ చేసింది. సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో ఆ సంస్థ బాగా నష్టపోయింది. ఇప్పుడు అభిషే పిక్చర్స్ సంస్థ ఇదే పరిశీలనను చూపుతూ విజయ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
డియర్ విజయ్ దేవరకొండ.. వరల్డ్ ఫేమస్ లవర్” పంపిణీ చేసి మా సంస్థ రూ.8 కోట్లు నష్టపోయాం. దానికి ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు మీ పెద్ద మనసుతో అభిమానుల కుటుంబాలకు రూ. కోట్ల విరాళాలు ఇస్తున్నావు. దయచేసి మమ్మల్ని, మా ఎగ్జిబిటర్లు మరియు పంపిణీదారుల కుటుంబాలను రక్షించండి” అని ట్వీట్లో ప్రదర్శించారు. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ప్రస్తుతం నెటిజన్లు వివిధ రకాలుగా వ్యవహరిస్తున్నారు.
Advertisement
నష్టం వచ్చిందని ఇప్పుడు అడుగుతున్నావ్.. లాభపడి ఉంటే విజయ్‌కి ఫోన్ చేసి డబ్బులు ఇచ్చేవాడివా..? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. అదే విధంగా నేటి బడా ఫ్యామిలీ హీరోల సినిమాలలో నష్టం వస్తే ఏ ప్రొడక్షన్ హౌస్ కైనా మీ అఫీషియల్ ఎకౌంట్ నుంచి అడిగే చేస్తే దమ్ము మీకు ఉందా..? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరో నెటిజన్ ‘అర్జున్ రెడ్డి’ సినిమా హిట్ అయితే ఎవరు ఏం మాట్లాడకుండా ఉన్నారు.. అప్పుడు లాభాలు చూశారు. తర్వాత విజయ్‌ని ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు అభిమానుల కోసం ఏదైనా చేస్తుంటే… ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ సినిమాకి విజయ్ ఏమైనా నిర్మాత? లాభాలు నష్టాలు గురించి నిర్మాతను అడగాలి కానీ.. ఇలా విజయ్‌ని ఎలా అడుగుతారు..? అని అభిషేక్ పిక్చర్ సంస్థను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి:
టాలీవుడ్ టాప్ 30 డైరెక్టర్స్ వారి భార్యలను మీరు చూశారా.. చూస్తే చూడ ముచ్చటైన జంట అనాల్సిందే..!!
ఎంతోమందిని ఉన్నత స్థాయికి అందించిన నిర్మలమ్మ… క్షణాల్లో ఎలా మరణించారో తెలుసా..?