Advertisement
Jawan Movie Review : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం జవాన్. పాపులర్ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమా ఇవాళ విడుదల అయింది. ఇందులో షారుఖ్ ఖాన్ తండ్రి కొడుకు రెండు పాత్రల్లో అలరించనున్నాడని అర్థమవుతుంది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, లేడీ సూపర్ స్టార్ నయనతార, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ప్రియమణి, దంగల్ భామ సాన్య మల్హోత్రా, యోగి బాబు, అసుర్ సిరీస్ సేమ్ రిధి డోగ్రా, ఇజాజ్ ఖాన్ కీలక పాత్రలు పోషించనున్నారు. అన్నిటికీ మించి జవాన్ సినిమాకు అనిరుద్ రవిచంద్రర్ సంగీతం అందించాడు.
Advertisement
కథ మరియు వివరణ :
సమాజంలో జరిగే తప్పులను సరిదిద్దడానికి విక్రమ్ రాథోడ్ ఆరుగురు అమ్మాయిలతో కలిసి ముంబైలో మెట్రో ట్రైన్ ను హైజాక్ చేస్తారు. ఆ తర్వాత అతడిని పట్టుకోవడానికి నర్మద (నయనతార) పోలీస్ ఆఫీసర్ ప్రయత్నిస్తుంది. విక్రమ రాథోడ్ టార్గెట్ ఖాళి (విజయ్ సేతుపతి) సామ్రాజ్యాన్ని నాశనం చేయడం. అలా టార్గెట్ చేస్తున్న సమయంలో విక్రమ్ రాథోడ్ కు ఎదురైన సవాళ్లు ఏమిటి? ఇంతకు ఆ విక్రమ్ రాథోడ్ ముఖం వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…!
Advertisement
దర్శకుడు అట్లి జవాన్ సినిమాలో ఏ ఒక్క అంశాన్ని కూడా వదల్లేదు. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు అదిరిపోయే త్రిల్లింగ్ అంశాలను సరికొత్తగా చూపించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కు ఆడియన్స్ ఫిదా అవుతారు. కంటిరెప్ప వాల్చకుండా చేశాడని తెలుస్తోంది. స్టార్ పవర్, స్టైల్స్, స్కేల్, సాంగ్స్, సర్ప్రైజ్ లు, ఎమోషన్ తో పాటు ముఖ్యంగా షారుఖ్ ఖాన్ మాస్ అవతార్ వంటి అంశాలను పర్ఫెక్ట్ గా చూపించారు. పుష్కలమైన థ్రిల్, ట్విస్టులు, సస్పెన్స్ తో సినిమా సాగిందని తెలుస్తోంది. బిగ్గెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు మరో మూడు గూస్ బంప్స్ మూమెంట్ ఉండటం సినిమాపై ఉన్న అంచనాలను రీచ్ అయ్యేలా చేసింది.
ప్లస్ పాయింట్స్
షారుఖ్ ఖాన్
ఇంటర్వెల్ ట్విస్ట్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
సాగదీత
పీక్ యాక్షన్
రేటింగ్ 3/5