Advertisement
సాధారణంగా చిన్నపిల్లలు మామూలుగా ఏడుస్తుంటారు. ఓ 10 నెలల చిన్నారి విపరీతంగా ఏడుపు మొదలుపెట్టడంతో ఆ తల్లిదండ్రులు మొదట్లో సాధారణ ఏడుపే మొదలు పెట్టడంతో ఆ తల్లిదండ్రులు తొలుత సాధారణ ఏడుపే అయి ఉంటుందని అనుకున్నారు. ఏం చేసినా ఆ పసిబిడ్డ ఏడుపు ఆపకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తరలించి డాక్టర్లకు చూపించారు. మొదట కడుపులో ఏదైనా కణితి ఉందా అని డాక్టర్లు భావించారు.
Advertisement
ఈ నేపథ్యంలో ఆపరేషన్ నిర్వహించగా.. వైద్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకు అంటే ఆ చిన్నారి కడుపులో కవలపిల్లలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో రెండు గంటలపాటు సర్జరీ నిర్వహించి ఆ పిండాలను తొలగించారు. ఈ ఘటన పాకిస్తాన్ లో జరిగింది. సాదికాబాద్ కి చెందిన 10 నెలల చిన్నారి విపరీతంగా ఏడవడం ప్రారంభించింది. ఆ చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కడుపునొప్పితో తమ బిడ్డ తీవ్ర ఇబ్బంది పడుతోందని డాక్టర్లకు చెప్పారు. ఆ డాక్టర్లు చిన్నారికి అల్ట్రా సౌండ్ టెస్ట్ నిర్వహించారు. చిన్నారి కడుపుకింది భాగంలో కణితి ఏర్పడిందని గుర్తించిన డాక్టర్లు.. బాలిక కడుపు పూర్తిగా ద్రవంతో నిండిపోయిందని భావించారు. అయితే ఆ కణితిని తొలగించేందుకు చిన్నారికి వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. వెంటనే ఏర్పాటు చేసి చిన్నారికి సర్జరీ చేశారు. బాలికకు ఆపరేషన్ కి చేసిన కణితిని తొలగించారు డాక్టర్లు. కడుపులో పూర్తిగా ఎదగని రెండు కవల పిండాలను గుర్తించారు.
Advertisement
దీంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఓ అరుదైన కేసు అని డాక్టర్లు వెల్లడించారు. సుమారు 5 లక్షల మంది ఆడపిల్లలలో ఒకరికి మాత్రమే వస్తుందని తెలిపారు. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే వ్యాధి కారణంగానే చిన్నారి కడుపులో రెండు పిండాలున్నాయని స్పష్టం చేశారు. ఆ చిన్నారి తన తల్లి కడుపులో ఉన్నప్పుడురెండు పిండాలు ఆరోగ్యవంతమైన ఈ శిశువు కడుపులోకి వెళ్లాయని.. అయితే అవి పెరగకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చిన్నారికి వైద్యం చేసిన సర్జన్ ముస్తాక్ అహ్మద్ వెల్లడించారు. 10 నెలల చిన్నారికి ఇలాంటి ఆపరేషన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్నదని తెలిపారు. 2 గంటల పాటు తమ డాక్టర్ల టీమ్.. శ్రమించి చిన్నారికి ఆపరేషన్ ని సక్సెస్ చేసినట్టు వివరించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.