Advertisement
భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ తన బ్యాటింగ్ స్టైల్ తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆయన 16 ఏళ్ల కెరీర్‌లో 26 టెస్టులు , 191 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. 200 కంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రముఖుడు. 1999, 2003 మరియు 2007 క్రికెట్ ప్రపంచ కప్‌లతో పాటు 2007 ICC వరల్డ్ ట్వంటీ 20 విజేత జట్టు భారతదేశానికి ప్రముఖ పాత్ర వహించాడు అగార్కర్. వన్డేల్లో భారత్ బౌలర్ అత్యధిక వికెట్లు తీసిన మూడోసారి నిలిచాడు.
Advertisement
అజిత్ కెరీర్ ఎంత అద్భుతంగా ఉందో, అతని వ్యక్తిగత జీవితం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అజిత్, ఫాతేమా లవ్ స్టోరీ ఓ సినిమా రేంజ్ లో ఉంటుంది. 1990 ప్రారంభంలో మజార్ దేశీయ స్థాయిలో గేమ్ ఆడాడు. దీంతో అతనికి అజిత్‌తో స్నేహం కుదిరింది. ఇక వారిద్దరూ ప్రాణ స్నేహితులిగా మారారు. అగార్కర్ ప్రాణ స్నేహితుడైన మజార్ సోదరి ఫాతేమా. 2000లో ఫాతేమా ముంబైలోని ఒక ప్రైవేట్ సంస్థలో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు అతను తన బెస్ట్ ఫ్రెండ్ ద్వారా ఆమెను కలిశాడు. ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించాడు.
Advertisement
మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి అజిత్ అగార్కర్ ముస్లిం యువతి అయిన ఫాతేమాను ప్రేమించి పెళ్లాడటం విశేషం. అజిత్ కుటుంబం మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబం కావడంతో ఫాతేమాని వివాహం చేసుకోవాలనే అజిత్ అభిప్రాయాన్ని ఆయన కుటుంబం వ్యతిరేకించారు. తాను ప్రేమించిన ఫాతేమాను వివాహం చేసుకోవడానికి అగార్కర్ సామాజిక ఆచార వ్యవహారాలపై పోరాడారు. ఆచారాలను ఉల్లంఘించి ప్రేమ వివాహం చేసుకోవడంతో కుటుంబం నుంచి పలు విమర్శలను సైతం ఎదుర్కొన్నాడు. ఆయన తన ప్రేమను గెలిపించుకొని 2002 సంవత్సరంలో ఫాతేమాను వివాహం చేసుకున్నాడు.
అజిత్ అగార్కర్ భార్య అసలు పేరు ఫాతేమా ఘడియల్లీ. ఆమె ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఫాతేమా క్వీన్ మేరీ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఇక సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి బి.కామ్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆమె వ్యూహాత్మక నిర్వహణ మరియు మార్కెటింగ్‌లో బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నుండి MBA డిగ్రీలో పట్టా పొందింది. ఫాతేమా చదువులో యూనివర్సిటీ టాపర్ కూడా. బీసీసీఐలో కీలక పదవిని కైవసం చేసుకొని ప్రధానంగా వార్తల్లో నిలిచిన అగార్కర్.. తన పాత ప్రేమ కథ ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read :
తమ పేర్లను మార్చుకున్న 7 దేశాలు.. ఎందుకు మార్చుకున్నాయంటే?
తమ చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్న భారతీయ క్రికెటర్లు ఎవరంటే..?
“ఇండియా” అన్న పేరు నుంచి “భారత్” అని మార్చాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?