Advertisement
సాధారణంగా వెజ్ కర్రీస్ అమ్మ ఫ్రిడ్జ్ లో పెట్టి మరుసటి రోజు వేస్తే.. ఛీ ఛీ వద్దూ అంటారు. అదే చికెన్, మటన్ వంటి కూరలు అయితే మొన్నటివి అయినా సరే హ్యాపీగా తినేస్తారు. కానీ చాలా మందికి నాన్ వెజ్ అంటే అంత ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టంతోనే మిగిలిపోయిన చికెన్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అది అయిపోయేంత వరకు తింటుంటారు. కానీ చికెన్ కర్రీని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినడం మంచిదేనా ? దీనిపై నిపుణులు ఏం అంటున్నారు..? ఆహార నాణ్యత నిబంధనల ప్రకారం.. ఈ రకం వండిన చికెన్ ని ఫ్రిజ్‌లో నిలువ చేసి తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, మీరు తినే చికెన్ తినడానికి సరిపోతుందో, లేదా పాడైపోయిందో తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కనీసం ఈ మార్గాలను అనుసరించి అయినా.. వాటిని తినాలా వద్దా డిసైడ్ అయితే ప్రమాదం కాసింతైన తగ్గుతుంది.
Advertisement
Advertisement
పాడైన చికెన్‌ను గుర్తించడంలో దీని నుంచి వచ్చే వాసన మనకు చాలా సహాయపడుతుంది. అయినప్పటికీ, అవి చెడిపోయే సంకేతాలను చూపించని సందర్భాలు ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలు, సాస్‌లతో కూడిన కోడి మాంసం దాని రుచి ,వాసన ఒకేలా ఉండటం వల్ల చెడిపోయి ఉంటే గుర్తించడం కష్టం. కానీ మీరు కాస్త వాసనను పసిగట్టే వారైతే దాన్ని సులభం గుర్తించవచ్చు.
పాడైన చికెన్ కర్రీ లాంటివి తినడం వల్ల వాంతులు, తల తరిగడం, విరోచనాలు వస్తాయి. ముఖ్యంగా ఫ్రిడ్జ్‌లో పెట్టిన చికెన్ కర్రీని వేడి చేసుకుని తింటారు. ఇది ఇంకా ప్రమాదం.కాబట్టి నాన్‌వెజ్ కర్రీని ఫ్రిడ్జ్‌లో పెట్టి అదేపనిగా తినడం మానేయండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వండిన ఆహారం తింటేనే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఫ్రిడ్జ్‌లో ఉంచినా సరే.. ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంటే.. అది చూసేందుకు బాగున్నా తినేందుకు పనికి రాదు అనే విషయాన్ని తప్పకుండా గుర్తు పెట్టుకోండి.