Advertisement
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. 1970 దశకంలో స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాతరలో నటిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తోంది. వంశీ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ లో ఈ సినిమాను విడుదల చేసేందకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తరువాత రవితేజ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతున్నట్టు సమాచారం. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్టు సమాచారం.
Advertisement
Advertisement
రీసెంట్ గా ఆ సినిమాని మేకర్స్ అనౌన్స్ కూడా చేస్తారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ తరువాత సినిమా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. రవితేజ తరువాత సినిమా మల్టీస్టారర్ గా తెరకెక్కుతుందని సమాచారం. మాస్ కా దాస్ గా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ బేబీ సినిమా నిర్మాత ఎస్.కే.ఎన్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న సందీప్ ఈ చిత్రాన్ని తెరకెక్కించుకోబోతున్నట్టు తెలుస్తోంది. మల్టీస్టారర్ విలన్ పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండబోతుందని సమాచారం. ఈ పాత్ర కోసం మంచు మనోజ్ ని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. రవితేజ, విశ్వక్ సేన్, మంచు మనోజ్ ఈ ముగ్గురి కాంబోలో ఎలాగైనా సెట్ అయ్యేలా ఎస్.కె.ఎన్.గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మనోజ్ సినిమా కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చింది. ఆయన హీరోగా అదిరిపోయే కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రకు ఒప్పుకుంటారో లేదో చూడాలి.