Advertisement
ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సినిమాలు తీయడం అంత సులువైన విషయం ఏమీ కాదు. ఎంత కష్టపడి తీసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఒక్కోసారి మనకి తెలియకుండానే కొన్నిసార్లు ఒక సినిమా ఫ్లాప్ అవ్వొచ్చు. అయితే.. ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సినిమాలు తీయాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా తోడవ్వాలి. ఆ రెండు కలిగి ఉండి సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్న వారి గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Advertisement
1. రాజమౌళి:
బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అంటే ముందు గుర్తొచ్చే పేరు రాజమౌళి. ఆయన తీసిన సినిమాలు అన్నీ హిట్లే. ఆయన డైరెక్షన్ లో మూవీ వస్తుంది అంటే పక్కా హిట్ అని ఫిక్స్ అయిపోతారు.. ఇప్పటివరకు ఆయన కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేదు.
2. లోకేష్ కనగరాజ్:
ఈయన తమిళ సినిమా దర్శకుడుగా అందరికి సుపరిచితమే. లోకేష్ మానగరం సినిమా తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా 2017లో రిలీజ్ అయ్యింది. మాస్టర్, విక్రమ్ సినిమాలతో పాపులర్ అయిన లోకేష్ కెరీర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
3. అనిల్ రావిపూడి:
ఆయన తన కెరీర్ లో మొత్తం ఆరు సినిమాలు చేసాడు మరియు అతని ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం సృష్టించింది.రాజమౌళి తర్వాత ఈ తరంలో టాలీవుడ్ లో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఏకైక దర్శకుడు అనిల్.
4. ప్రశాంత్ నీల్:
Advertisement
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉగ్రం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు . ఈ సినిమా తరువాత ఆయన కెజిఎఫ్ తీశారు. ఇది రెండు పార్టీలుగా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో చెప్పక్కర్లేదు.
5. సందీప్ రెడ్డి వంగా:
ఈ దర్శకుడు ఒక్క సినిమానే రెండు భాషలలో తీశారు. అదే తెలుగులో అర్జున్ రెడ్డి, హిందీ లో కబీర్ సింగ్. మరోసారి ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాయడానికి ఆయన “యానిమల్” సినిమాతో వస్తున్నారు.
6. అట్లీ:
ఈ తమిళ దర్శకుడి అసలు పేరు అరుణ్ కుమార్. అట్లీగా అందరికీ పరిచయం అయ్యారు. దర్శకుడు శంకర్ వద్ద ఈయన అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసారు. అట్లీ రాజారాణి సినిమాతో ఇండస్ట్రీలో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఆ తరువాత, తేరి, మెర్సల్, బిగిల్, జవాన్ సినిమాలు తీశారు. ఇవన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి.
మారి సెల్వరాజ్:
ఈ దర్శకుడు ఇప్పటివరకు పరియేరుమ్ పెరుమాళ్క, కర్ణన్, మామన్నన్ , ధృవ్ విక్రమ్ 4 సినిమాలకు దర్శకుడిగా పనిచేసారు. అయితే అన్ని సూపర్ హిట్లే.
మరిన్ని..
అంబానీతో పెళ్ళికి ముందు నీతా అంబానీ ఆ పని చేసేవారట ! ఆమె జీతం ఎంతంటే ?
విదేశాలకు వెళ్లేటప్పుడు భారతీయులు చేసే 7 అతి పెద్ద ప్రయాణ తప్పులు ఏంటంటే..?