Advertisement
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్-హీరోయిన్ నయనతార నటించిన తాజా మూవీ జవాన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద షేక్ చేస్తోంది. రెండు రోజుల్లోనే రూ.250 కోట్లు వరకు గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం రూ.1000 కోట్ల మార్క్ ను క్రాస్ చేయడం విశఏషం. ఇందులో తండ్రి కొడుకుగా డబుల్ రోల్ లో షారుఖ్ మెప్పించాడని అందరికీ తెలుసు. కానీ చాలా సీన్స్ లో డూప్ యాక్ట్ చేశాడని మీకు తెలిసి ఉండదు. ఇంతకు డూప్ గా నటించింది ఎవరు ? అతని రెమ్యునరేషన్ ఏంత అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
జవాన్ మాత్రమే కాదు.. గత 15 ఏళ్ల నుంచి షారుఖ్ ఖాన్ కి డూప్ గా నటిస్తున్న వ్యక్తి పేరు ప్రశాంత్ వాల్దె. ఇతను షారుఖ్ కి డూప్ గా నటిస్తున్నప్పటికీ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా పలు సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జవాన్ విశేషాలు బయటపెట్టాడు. జవాన్ ఓ సీన్ ఉంది. తండ్రిని కొడుకు హగ్ చేసుకునే సన్నివేశం. అది చేసేటప్పుడు షారుఖ్ ఖాన్ కొడుకు గెటప్ వేస్తే.. నేను తండ్రి గెటప్ వేశారు నన్ను కౌగిలించుకునే సమయంలో ఆయన క్లోజప్ షాట్స్ తీశారు. తరువాత నేను కొడుకు గెటప్ వేస్తే.. షారూఖ్ తండ్రి గెటప్ సీన్స్ తీశారు. అంటే ఒకే రోజు మేమిద్దరం రెండు వేర్వేరు గెటప్ వేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు ప్రశాంత్.