Advertisement
సినిమా అన్నాక హీరో, హీరోయిన్స్ మాత్రమే కాకుండా ఇతర సైడ్ క్యారెక్టర్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని పాత్రలైతే ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతాయి. అలా ఇంపాక్ట్ చూపించిన పాత్రలలో ఎవరైనా కొత్త నటులు నటిస్తే.. వారు ఎవరో తెలుసుకోవాలి అని చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అలంటి పాత్రనే బేబీ సినిమాలో ఓ వ్యక్తి చేసాడు. అదేనండి బేబీ ని పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు. సినిమాలో తన రోల్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇంతకీ ఆ రోల్ చేసిన అతను ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Advertisement
చిన్న సినిమాగా రిలీజ్ అయినా తొంబై కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన బేబీ మూవీ ఏ రేంజ్ లో ట్రెండింగ్ లో నిలిచిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో వైష్ణవి చైతన్య హాట్ టాపిక్ గా మారింది. ఆమె రేంజ్ ఓవర్ నైట్ లో పెరిగిపోయింది. బేబీ సినిమాలో తానూ ప్రేమించిన ఇద్దరు వ్యక్తులను కాకుండా.. తల్లి తండ్రులు చూసిన మూడో వ్యక్తిని వైష్ణవి పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళిలో కాసేపు మెరిసిన ఆ కుర్రాడి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ యాక్టర్ ఎవరా? అని అందరు చర్చించుకుంటారు.
Advertisement
ఆ యాక్టర్ పేరు కృష్ణ మల్లిడి. టాలీవుడ్ లో చాలా సినిమాలలోనే కనిపించాడు. చిన్న చిన్న రోల్స్ చేసే కృష్ణ మల్లిడి కలర్ ఫోటోలో హీరోకి సీనియర్ గా కనిపించి మెప్పించాడు. అయితే.. ఈయన ఎవరో కాదు. బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వేణు మల్లిడి కి స్వయానా సోదరుడట. ఇతను యాంకర్ విష్ణు ప్రియకి కూడా రెలెటివ్ అవుతారట. బేబీ సినిమాలో ఇతను కనిపించింది కొంతసేపు అయినా ఈ క్యారెక్టర్ చాలా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో మీమ్స్ కూడా చాలానే వచ్చాయి.
మరిన్ని..