Advertisement
హిందీ టివి లో బాగా పాపులర్ అయినా టివి షోస్ లో కౌన్ బనేగా కరోడ్ పతి మొదటి స్థానం లో ఉంటుంది. దీనిని బిగ్ బి హోస్ట్ చేసి దీని రేంజ్ ను మరింత పెంచారు. ఈ షో కు యావత్ దేశమంతా ఫాలోయింగ్ ఉంది. సౌత్ రాష్ట్రాల్లో ప్రజలు సైతం ఈ షో ను ఆసక్తిగా చూస్తారు. ఈ షో లో ప్రశ్నలు మెదడుకు పదును పెట్టే విధంగా ఉంటాయి. ఈ షోకు సంబంధించిన వార్తలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.
Advertisement
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రశ్నకు సంబంధించిన ఓ ప్రశ్న వైరల్ అవుతోంది. ఈ ప్రశ్నను యువకుడు జస్కరిన్ సింగ్ ను అడిగారు. ఈయన కేబీసీ పదిహేనవ సీజన్లో పార్టిసిపేట్ చేసారు. ఈ ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేకపోవడంతో.. అతను క్విట్ అయిపోయి.. కోటి రూపాయలను గెలుచుకున్నాడు. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
“పద్మ పురాణాన్ని అనుసరించి జింక పెట్టిన శాపం వలన ఏ రాజు దాదాపు 100 సంవత్సరాల పాటు పులిగా జీవించాడు?” అన్న ఈ ప్రశ్నకు యువకుడు జస్కరిన్ సింగ్ సమాధానం చెప్పలేకపోయారు. దీనికి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. అవి.. A. క్షేమధురిత్, B. ధర్మదత్తా, C. మితధ్వజ, D. ప్రభంజన అనే ఆప్షన్లు. వీటికి సమాధానం ఆప్షన్ D . రాజు ప్రభంజన జింక శాపం కారణముగా వంద సంవత్సరాల పాటు పులిగా జీవించాడు.
Watch video: