Advertisement
జైలర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రజినీకాంత్ ఫుల్ జోష్ లో ఉన్నారు. డెబ్భై ఏళ్ల వయసులో కూడా ఆయన నేటి పాన్ ఇండియా స్టార్లకు పోటీగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అసలు రజిని పని అయిపొయింది అన్న విమర్శకుల నోళ్ళన్నీ “జైలర్” సినిమాతో మూత పడ్డాయని చెప్పవచ్చు. ఈ సినిమాతో ఏకంగా ఆరువందల కోట్ల రూపాయల కలెక్షన్ ను సాధించిన రజిని తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు.
Advertisement
రజిని నటి లతను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారి పేర్లు ఐశ్వర్య, సౌందర్య. రజిని కాంత్ సినిమాల్లోకి రాకముందు బెంగళూరు లో బస్సు కండక్టర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. ఆ టైం లో ఓ అమ్మాయి రోజు బస్సు ఎక్కేది. రజినీకాంత్ ను సినిమాల్లో ట్రై చేయాలనీ సూచన చేసేది. అప్పట్లో వారిద్దరి మధ్య ప్రేమ రాయబారాలు ఉండేవని అందరు అనుకునేవారట. ఆయన ప్రతిభను చూసి ఆ అమ్మాయి స్టార్ హీరో అవుతావు అంటూ ప్రోత్సహించేదట.
Advertisement
ఆ అమ్మాయే డబ్బులు ఇచ్చి మరీ రజినీని ఇండస్ట్రీకి పంపించింది. రజిని స్టార్ హీరో అయ్యాక ఆ అమ్మాయి ఆచూకీ కోసం చాలా ప్రయత్నించారట. ఆ అమ్మాయి గురించి తెలిస్తే.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారట. కానీ ఆ అమ్మాయి గురించి తెలియలేదట. ఇక ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం కోసం పెళ్లి చూపులకు వెళ్తే, ఆ అమ్మాయి రజినిని చూసి.. అబ్బాయి దొంగలా ఉన్నాడని, పైగా నల్లగా కూడా ఉన్నాడని రిజెక్ట్ చేసిందట. ఆ తరువాత సహా నటి లతతో తలైవా ప్రేమలో పడడం, ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి.
మరిన్ని..