Advertisement
సాధారణంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా సూర్యున్ని గ్రహాలకు రారాజుగా పిలుస్తారు. శనిని న్యాయదేవతగా, బుధుడిని యువరాజుగా, గురుడిని గురు గ్రహంగా భావిస్తుంటారు. గ్రహాల యొక్క రాజకుమారుడు అయిన బుధుడు బుద్ధి, తర్కం, వాదన, వ్యాపారానికి ప్రతీక. బుధుడి ప్రతి కదలిక ఈ అంశాలపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. సూర్యుడి రాశిగా భావించే సింహరాశిలో బుధుడి సక్రమ మార్గం వల్లనే ప్రధానంగా మూడు రాశులకు లాభం కలుగనుంది. ఏయే రాశుల వారు అనే విషయాలను తెలుసుకుందాం.
Advertisement
మేష రాశి :
జీవిత భాగస్వామితో బంధం చాలా బలోపేతం అవుతుంది. అకస్మిక ధనలాభం కలుగుతుంది. అదే సమయంలో పొదుపును కూడా చేస్తారు. వ్యాపారస్తులకు భారీ ఆర్డర్లు రావడం వల్ల లాభాల్లో ఉంటారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో పదోన్నతి ఉంటుంది.
Advertisement
సింహా రాశి :
సెప్టెంబర్ 16వ తేదీ నుంచి వీరి పరిస్థితి మొత్తం మారిపోతుంది. వీరికి అనేక లాబాలున్నాయి. చేపట్టిన పనులు వెంటనే పూర్తవుతాయి. ఆలోచనల్లో ఉన్నవి కార్యరూపం దాలుస్తాయి. ఆదాయం పెరగడంతోపాటు ఆకస్మిక ధనలాభం వల్ల ఆర్థికంగా బలోపేతమైన స్థితిలో ఉంటారు. గతంలో మొదలై ఆగిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. అదృష్టం వీరికి తోడుగా ఉంటుంది.
ధనస్సు :
ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా ఎలాంటి కష్టాలుండవు. వ్యాపారస్తులకు ఊహించని లాభం ఉంది. కష్టార్జితంతో పాటు సమాజంలో మీకు ఉండే పరిచయాల ఆధారంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. పెళ్లి జీవితం చాలా బాగుంటుంది. దీంతో ధనలాభం ఉంది. ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. కుటుంబ సభ్యులతో గడపేందుకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు.