Advertisement
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ తరుణంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేక ఎవ్వరూ మాట్లాడినా నాలుక లాగేస్తామని.. కళ్లు పీకేస్తామని హెచ్చరించారు. షెకావత్ ఈ వ్యాఖ్యలు వారం రోజుల కిందటే చేసినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బీజేపీ పరివర్తన్ యాత్రలో భాగంగా ఆయన రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Advertisement
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై షెకావత్ స్పందిస్తూ.. “ సనాతనానికి వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడినా ఈ దేశంలో రాజకీయ హోదాను అధికారాన్ని నిలబెట్టుకోలేడని చెప్పారు. మన సంస్కృతి చరిత్రపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దాణా కుంభకోణం తదితర కుంభకోణాల్లో పాలు పంచుకున్న వారి సమూహమే ప్రతిపక్ష ఇండియా కూటమి అని షెకావత్ పేర్కొన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని ఓడించడమే ప్రతిపక్షాల లక్ష్యం అన్నారు.
మోడీ గెలిస్తే సనాతన శక్తిమంతుడవుతారని, అందువల్ల ఆయనను ఓడించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు. రెండు రోజుల క్రితం డీఎంకే ముఖ్యమంత్రి కుమారుడు సనాతనానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ దీనిని కరోనా వైరస్ తో పోలుస్తూ, సనాతన సంస్కృతిని దేశం నుంచి తొలగించాలని అంటున్నారని తెలిపారు మంత్రి షెకావత్.