Advertisement
ప్రెజర్ కుక్కర్ లేకుండా ఏ వంటిల్లూ ఉండదు. ప్రస్తుత తరంలో మహిళలు అందరు వంట చేయడానికి ప్రెజర్ కుక్కర్ ని కచ్చితంగా ఉపయోగిస్తూనే ఉంటారు. కుక్కర్ తో వంట చేయడం సులభమే. అయితే.. అన్ని పదార్ధాలను కుక్కర్ లో ఉడికించకూడదు. కొన్ని పదార్ధాలను కుక్కర్ లో ఉడికించడం వలన అవి హానికర పదార్ధాలుగా మారి మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. ఇంతకీ, ఏ ఏ పదార్ధాలను కుక్కర్ లో వండకూడదో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Advertisement
1. నూడుల్స్:
సాధారణంగా నూడుల్స్ ను పాన్ లో మాత్రమే వండుతారు. అయితే.. కొంతమంది వీటిని ఉడికించడానికి కుక్కర్ ను వాడతారు. కానీ అది ఎంత మాత్రం సేఫ్ కాదు. ఎందుకంటే ఇవి కుక్కర్ లో పెట్టినప్పుడు వీటి నుంచి వచ్చే నురగ, చిన్న చిన్న ముక్కలు కుక్కర్ విజిల్ రంధ్రాలలో ఇరుక్కునే అవకాశం ఉంది.
2. బంగాళాదుంప:
భారతీయ వంటల్లో బంగాళాదుంప ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని కుక్కర్ లో ఉడికించడం చాలా సులభం. కానీ అది మంచిది కాదు. కుక్కర్ లో ఉడకడం వల్ల వచ్చే స్టార్ట్ ఆరోగ్యానికి హానికరం.
3. అన్నం:
భారతీయ మహళలు అసలు కుక్కర్ ను వాడేదే అన్నం వండడానికి. కానీ, అన్నం కుక్కర్ లో ఉడికించకూడదని మీకు తెలుసా? అన్నం కుక్కర్ లో వండడం వలన అక్రిలామైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది.
4. ఫ్రైడ్ ఫుడ్స్:
Advertisement
వేయించి చేయాల్సిన పదార్ధాలకు బాండలిని మాత్రమే ఉపయోగించాలి. ఇటువంటి పదార్ధాలను ఆయిల్ లో వేసి కుక్కర్ లో పెట్టకూడదు.
5. క్రీమీ సాస్:
క్రీమీ సాస్ ను తయారు చేయడానికి పెద్ద పెద్ద బాండలిని ఉపయోగించడమే మంచిది. దీనిని అస్సలు కుక్కర్ లో వండకూడదు.
6. ఫిష్:
చాలా మంది మెత్తగా ఉడుకుతుంది అని చేపలను కుక్కర్ లో పెట్టేస్తూ ఉంటారు. కానీ, కుక్కర్ లో పొరపాటున కూడా చేపలను ఉడికించకూడదు. ఇంకెప్పుడు ఇలా చేయకండి.
7. స్టీక్:
కుక్కర్ లో స్టీక్ వండితే అది మెత్తగా ఉడికి తినడానికి అనువుగా ఉంటుంది. కానీ, ఇది సరైన పద్ధతి కాదు. కుక్కర్ లో స్టీక్ ను ఉడికించకూడదు. దీనిని కేవలం పాన్ ల లోనే వండాలి.
8. సీ ఫుడ్స్:
పీతలు, రొయ్యలు వంటి వాటిని కేవలం బాండలిలోనే వండడం మంచిది. వీటిని వండడానికి కుక్కర్ ని వాడవద్దు. మూత పెట్టుకునే సౌకర్యం ఉన్న పాన్ లలో ఉడికించడం వలన మధ్య మధ్యలో చెక్ చేసుకోవడానికి వీలు అవుతుంది.
మరిన్ని..