Advertisement
ఏపీలో రాజకీయాలు మరింత హీట్ పెంచుతున్నాయి. టిడిపి నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఏపీలో రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. మరోవైపు టీడీపీ ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో పరిణామాలను కేంద్ర పార్టీ బిజెపి నిశితంగా గమనిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రతిస్పందన కూడా కీలకంగా మారింది. జమిలి ఎన్నికల వేళ జరుగుతున్న ఈ మార్పులు ఏపీ రాజకీయాలను ఎటువైపు తిప్పుతాయో అన్న సందేహాలు ప్రజలలో నెలకొని ఉన్నాయి.
Advertisement
చంద్రబాబు నాయుడు స్క్వాష్ పిటీషన్ తో పాటు బెయిల్ కోసం హై కోర్ట్ లో అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు పై ఉన్న కేసుల విచారణ జరగనుంది. మరో వైపు అమరావతి భూముల వ్యవహారంపై కూడా సిఐడి విచారణ చేయనుంది. టిడిపి ఇతర నేతలపై ఉన్న కేసులు కూడా బయటకు వస్తున్నాయి. దీనితో టిడిపి ముఖ్య నేతల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల సమయంలో కేసుల్లో చిక్కుకుంటే ఎటువంటి పరిణామాలు వస్తాయి అన్న విషయమై ఆందోళన నెలకొంది.
Advertisement
ఎన్నికల వేళ ఈ అరెస్ట్ లు ఎవరికి కలిసి వస్తాయి అన్న విషయమై చర్చ జరుగుతోంది. టీడీపీ ఫాలోయర్స్ లో సహజంగానే ఆక్రోశం నెలకొంది. మరో వైపు వైసీపీ ఫాలోయర్స్ లో ఏమి జరుగుతుందో అన్న ఉత్సుకత నెలకొంది. అయితే.. తటస్తులు ఎలా ఫీల్ అవుతున్నారనేది తెలియాల్సి ఉంది. వీరిలో లబ్ధిదారులు ఉంటె వారి ఓటు వైసిపికే ఉంటుందని వైసిపి పార్టీదారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ కేసులు మరీ ఎక్కువ అయితే.. ఈ అభిప్రాయం మారే అవకాశాలు ఉన్నాయి. దీనితో..నెక్స్ట్ టార్గెట్ ఏంటి? అన్న విషయం లోను.. ఓ వైపు కేసులు మరో వైపు ఎన్నికల మధ్య ఏపీ రాజకీయం రసవత్తరంగా ఉంది.
మరిన్ని..