Advertisement
Varalakshmi Tiffin Center Gachibowli Owner: హైదరాబాద్ లో వరలక్ష్మి టిఫిన్స్ ఫేమస్ అయ్యాయి. దాదాపు పది బ్రాంచుల వరకు ఉన్నాయి. వీటిని స్థాపించిన వ్యక్తి ప్రభాకర్ రెడ్డి. రోడ్డు పక్కన చిన్న చిన్న బండ్లు పెట్టుకుని టిఫిన్ వ్యాపారం చేసిన ప్రభాకర్ రెడ్డి ధైర్యం చేసి హైదరాబాద్ కు వచ్చారు. వరలక్ష్మి టిఫిన్స్ ను స్థాపించిన అందులో సక్సెస్ అయ్యారు. లాభాలు వస్తుండడంతో వ్యాపారాన్ని విస్తరించి కొత్త బ్రాంచ్లు ఏర్పాటు చేసారు. అలా పది బ్రాంచుల వరకు ఏర్పాటు చేసారు. కనీసం పదవ తరగతి కూడా చదువుకోని ప్రభాకర్ రెడ్డి పది బ్రాంచులను ఏర్పాటు చేసారు.
Advertisement
ఓ స్థాయికి ఎదిగిన ప్రభాకర్ రెడ్డి ఆపై డ్ర$ కు బానిస అయ్యాడు. ఫలితంగా డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలు పాలయ్యాడు. ఆయన స్టోరీని ఈ ఆర్టికల్ లో చదవండి. పదవ తరగతిలోనే చదువు మానేసిన ప్రభాకర్ రెడ్డి రోడ్డు సైడ్ టిఫిన్ బండి పెట్టి వ్యాపారం చేసేవారు. 2017 వ సంవత్సరంలో వ్యాపారం చేద్దాం అన్న ఉద్దేశ్యంతో ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రభాకర్ రెడ్డి వరలక్ష్మి టిఫిన్స్ ను ప్రారంభించారు.
Advertisement
మొదటగా గచ్చిబౌలి పరిధిలోని డీఎల్ఎఫ్లో చిన్న టిఫిన్ సెంటర్ ప్రారంభించారు. అయితే.. రుచి అందరికి నచ్చడంతో త్వరలోనే పాపులర్ అయ్యారు. క్రమంగా బ్రాంచ్ లను కూడా ప్రారంభించారు. “వరలక్ష్మి టిఫిన్స్” పేరిట ఏకంగా పది బ్రాంచ్ లను ఏర్పాటు చేసారు. హైదరాబాద్ లో ఈ టిఫిన్ సెంటర్స్ బాగానే ఫేమస్ అయ్యాయి. ఈ సెంటర్స్ నుంచి ప్రతి రోజు లక్షలాది రూపాయల ఆదాయం వచ్చేది. దీనితో ఆయన డ్ర##గ్స్ దందా వైపుకు వెళ్లారు. పగటిపూట టిఫిన్స్ వ్యాపారం చేస్తూ.. రాత్రి సమయాల్లో డ్ర##గ్స్ దందా చేయడం ప్రారంభించారు.
అనురాధ ద్వారా ఈ దందా చేసేవారు. వీరు డ్ర##గ్స్ ఇతరులకు విక్రయించడంతో పాటు వారు సొంతంగా వాడుకునేవారు కూడా. వీరికి పల్లెటూరి పుల్లట్లు టిఫిన్ సెంటర్ యజమాని వెంకట శివసాయికుమార్ సహకరించేవారు. అయితే వీరి దందా గురించి పోలీసులకు సమాచారం రావడంతో సైబరాబాద్ మోకిలా పోలీస్ లు వీరిని అరెస్ట్ చేసారు. అనురాధది కరీం నగర్. పెళ్లి అయ్యాక భర్తతో హైదరాబాద్ వచ్చారు. అక్కడ స్నేహితుడి వలన డ్ర##గ్స్ అలవాటు అయ్యాయి. ఆ తర్వాత భర్త విడాకులు ఇవ్వడంతో పిల్లాడిని తల్లి వద్ద ఉంచి మకాం మార్చేసింది. ప్రభాకర్ రెడ్డితో కలిసి డ్ర#!గ్స్ దందాలో దిగింది. ఎవరికీ దొరక్కుండా డ్ర##గ్స్ తీసుకొచ్చి ప్రభాకర్ రెడ్డికి ఇచ్చేది. ప్రస్తుతం వీరు పోలీస్ కస్టడీలో ఉన్నారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ చదవండి !