Advertisement
ప్రపంచ దేశాలు అన్నీ టెక్నాలజీతో ముందుకు పోతుంటే, భారతదేశంలో మాత్రం మూఢనమ్మకాలు, స్వామీజీలు అంటూ మూడ భక్తిని నమ్ముతూ ముందుకు పోతున్నారు. కొంతమంది స్వామీజీల వలలో పడి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అయితే ఈ బాబా లు స్వామీజీ లు ఇప్పటికే చాలామంది అనేక మోసాలు చేసి అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసి దొరికిపోయి కటకటాల పాలయ్యారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకునే స్వామీజీ నిత్యానంద స్వామి.
Advertisement
ఈయన ఆ మధ్య కాలంలో అమ్మాయిలతో రాసలీలలు చేశారని ఆరోపణలు రావడంతో పోలీస్ కేసులు అయ్యాయి. దీంతో ఆయన వేరే దేశాలకు వెళ్లి తలదాచుకున్నారు. అక్కడి నుండే తన కార్యకలాపాలన్నీ ఆన్లైన్ ద్వారా నడిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆ స్వామీజీ పేరు ఎక్కువగా బయట వినపడటం లేదు. కానీ తాజాగా హీరోయిన్ ప్రియా ఆనంద్ చేసిన కామెంట్ల వల్ల మళ్లీ స్వామీజీ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ప్రియా ఆనంద్ నిత్యానంద స్వామిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని అన్నది. దీంతో ఆమె అన్న మాటలు సోషల్ మీడియా లో దుమారం రేపుతున్నాయి. అమెరికాలో పెరిగిన ఈ అమ్మడు చాలా భాషల్లో నటించింది.
Advertisement
ఈ మధ్య తెలుగులో కూడా ఒక వెబ్ సిరీస్ లో నటించింది. మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో అనేక మంది స్టార్ హీరోలతో నటించింది. ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకు రాగా ఆమె నేను నిత్యానంద స్వామిని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను అని ఆశ్చర్యకర కామెంట్స్ చేసింది. ఆయన గురించి ఎలాంటి ప్రచారం జరుగుతున్నా కానీ వేలాది మంది భక్తులు ఆరాధిస్తున్న వ్యక్తి నిత్యానంద స్వామి అని, పెళ్లి చేసుకుంటే తను పేరు మార్చుకోవాల్సి వస్తుంది అని సరదాగా బదులిచ్చింది ఈ అమ్మడు.
also read:
అటు తండ్రి, ఇటు కొడుకు ఇద్దరి సినిమాలలో కనిపించిన 10 హీరోయిన్స్