Advertisement
గత శనివారం ఏపీ సర్కార్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. విజయవాడ ఎసిబి కోర్టు చంద్రబాబు నాయుడుకి ఇంటి నుండి భోజనం, మందులు జైలుకు తెప్పించేందుకు ప్రత్యేక అనుమతిని కూడా అందించింది. అదనంగా కోర్టు అతనికి స్పెషల్ క్లాస్ సౌకర్యాలు కల్పించాలని జైలు శాఖను ఆదేశించింది. కోర్టు తీర్పుతో.. ప్రముఖులు అరెస్ట్ అయినప్పుడు వారిని వీఐపీలుగా పరిగణిస్తారా..? ప్రముఖులు జైలుకు వెళ్లిన తర్వాత వారికీ ఏమి సౌకర్యాలు కల్పిస్తారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
1894లో ప్రిజన్స్ యాక్ట్ (జైళ్ల చట్టం) అమలులోకి వచ్చింది. వివిధ కారణాల వలన మద్యం తర్వాత ప్రిజన్స్ యాక్ట్ మార్పులు చేర్పులు చేయటం జరిగింది. మార్పులకు అనుకూలంగా జైళ్ల శాఖ మ్యానువల్ లో ఎక్కడ వీఐపీ అని ప్రెజన్స్ అధికారులు చెబుతున్నారు. ఒక ఖైదీకి ఉన్న ఆర్థిక స్థితిగతులు, జీవన శైలి , వారి హోండాను పరిశీలించి ఆ తర్వాత స్పెషల్ క్లాస్ ఖైదీగా పరిగణిస్తారని జైలు అధికారులు వెల్లడిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఉన్న వ్యక్తి న్యాయస్థానం నుండి అనుమతిని కూడా తీసుకోవాలి.
Advertisement
న్యాయస్థానం గనుక ప్రత్యేక ఖైదీగా పరిగణిస్తే.. జైలుకు వచ్చే ప్రముఖుల కోసం ప్రత్యేక బ్యారెట్లు ఉంటాయి. వాటిలో ఉండే ప్రత్యేక గదులను వారికి కేటాయించడం జరుగుతుంది. వారికి కేటాయించే గదులకు ఎటాచ్డ్ బాత్ రూమ్లు ఉంటాయి. అదనంగా ఆ ఖైదీకి జైలులో ప్రత్యేక గదిలో బెడ్ , రైటింగ్ టేబుల్ , అల్మారా, ఏసీ, ఫ్రిజ్, టివి వంటి సౌకార్యాలు కల్పిస్తారు. అదనంగా వారు ఇంటి నుండి వంటకు సంబంధించిన సామాగ్రి తెప్పించుకొని జైలులో వండించుకొని తినొచ్చు. లేకపోతే వంట ఓండే వ్యక్తిని జైలు అధికారులు కేటాయిస్తారు. లేకపోతే న్యాయస్థానం అనుమతితో ఇంటి నుండి భోజనం తెప్పించుకోవచ్చు. ఇక వారి దుస్తులు ఉతికేందుకూ కూడా మనిషిని కేటాయిస్తారు. వీఐపీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలనే నిబంధన జైళ్ల శాఖ పరిధిలోకి రావని కోర్టు అనుమతితోనే ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.
అలా అని కోర్టు స్పెషల్ క్లాస్ అడిగిన వారి అందరికి ఇవ్వలేదని జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలా స్పెషల్ క్లాసులు కావలసినవారు ముందుగా పత్రాలను కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఐటి రిటన్స్ తో సహా అనేక డాకుమెంట్స్ కోర్టుకు సమర్పించవలసి వస్తుంది. ప్రముఖ వ్యక్తులు జైలులో ఖైదీలుగా ఉన్న సమయంలో వారి భద్రత విషయంలో ఆందోళన ఉంటుంది. ఎంత ప్రముఖ వ్యక్తి అయినా కూడా ఒకసారి జైల్లోకి ప్రవేశించిన తర్వాత వారి భద్రత చూడాల్సిన బాధ్యత జైళ్ల శాఖ పైన ఉంటుంది. వారికి ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్లను మరియు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని జైలులోకి రానివ్వరు.