Advertisement
హైదరాబాద్ లో డ్ర**స్ దందా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక ముద్దాయిగా అనురాధ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో పుల్లట్లు టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు శివ సాయి కుమార్, వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి విదితమే.
Advertisement
అయితే.. అనురాధ ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. ఆమెను విచారిస్తున్న పోలీసులు ఆమె లైఫ్ స్టయిల్, ఆదాయం గురించి తెలుసుకుని విస్తుపోతున్నారు. ఆమె వివరాలు బయటకు రావడంతో.. జనాలు ఇదేమి పనులు అంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు.
అనురాధ సొంత ఊరు కరీంనగర్ జిల్లా గన్నేరుగూడ. ఎంబీఏ చదివిన అనురాధ కొంతకాలం క్రితం హైదరాబాద్ వచ్చింది. తన చదువుకు తగ్గ ఉద్యోగం చూసుకుంది. గచ్చిబౌలిలో ఉన్న ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఆమె జాబ్ చేస్తున్నారు.
సొంతూరులో ఉన్న దుకాణాల ద్వారా ఆమెకు అరవై వేల వరకు ఆదాయం వస్తుంది. ఆమె తండ్రి రిటైర్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో.. తండ్రికి ఇరవై వేల వరకు పెన్షన్ కూడా వస్తుంది.
ఇలా మొత్తం కలుపుకుంటే నెలకు ఆమెకు రెండు లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఇప్పటికే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అనురాధ భర్తతో గొడవ వచ్చి విడిపోయింది. ఈ క్రమంలోనే ఆమె చెడు వ్యసనాలకు బానిసయ్యింది.
Advertisement
డ్ర**స్ కి కూడా బానిస అయిన అనురాధ వీకెండ్ పార్టీలు, గోవా టూర్ వెళ్ళడాలు చేసేది. గోవా టూర్ కి వెళ్లిన అనురాధకు ఓ నైజీరియా వ్యక్తితో పరిచయం అయ్యింది.
అతను చేసే డ్ర**స్ దందాని అనురాధ కూడా మొదలెట్టింది. అతని వద్ద గ్రాము పదివేలకు కొనుగోలు చేస్తూ.. నగరానికి వచ్చి గ్రాము ఇరవై వేలకు అమ్మడం మొదలు పెట్టింది. క్రమంగా టిఫిన్ సెంటర్ యజమానులతో చేతులు కలిపి తన వ్యాపారాన్ని సాగించుకుంది. ఈ క్రమంలోనే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డికి కూడా పరిచయం అయ్యింది.
వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం కూడా కొనసాగింది. అయితే.. ఈ దందాలో మేజర్ షేర్ అనురాధ తీసుకునేది. ప్రస్తుతం అనురాధ స్నాప్ చాట్, వాట్సాప్ డేటా ఆధారంతో కస్టమర్ల వివరాలను సేకరిస్తున్న పోలీసులు నైజీరియాకు చెందిన వ్యక్తిని కూడా పట్టుకునే పనిలో ఉన్నారు.
మరిన్ని..