Advertisement
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో రోజు రోజుకు చాలా ఆసక్తకిర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆరు నెలల్లో టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించి అభివృద్ధికి బాటలు వేద్దామని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్న సమయంలోనే.. చంద్రబాబు అరెస్ట్ కావడం గమనార్హం. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు చంద్రబాబు. స్కిల్ డెవలప్ మెంట్ కింద జైలు పాలవుతానని కలలో కూడా ఊహించి ఉండడు చంద్రబాబు. 2024 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని.. ఈ ఎన్నికల తరువాత తాను రాజకీయాలకు విరామం తీసుకుంటానని చెప్పిన చంద్రబాబు.. ఊహించని విధంగా ఎన్నికలకు ముందే విరామం తీసుకునే పరిస్థితి ఏర్పడింది.
Advertisement
Advertisement
తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను ఓసారి పరిశీలించినట్టయితే.. షెడ్యూల్ కంటే ముందే ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ విషయాన్ని ఇటీవలే అధికార వైసీపీ ప్రకటించింది. ఎన్నికల సమయానికి బాబు బయటికి వస్తారా ? లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబుకు మరో ఆరు నెలలు జైలు శిక్ష ఉంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈసారి ఎన్నికల సమయం అంతా చంద్రబాబు జైలులోనే గడిపే అవకాశముంది. ఈ ప్రభావం టీడీపీకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కలలు కన్నా చంద్రబాబుకి స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ ద్వారా ఊహించని విధంగా సీఎం జగన్ బ్రేకులు వేశారనేది కొంత మంది రాజకీయ విశ్లేషకుల వాదన. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఏం జరుగుతుందనేది కొద్ది రోజులు వేచి చూడాలి మరీ.
Also Read :
లోకేష్ బాబు అరెస్ట్ కి CID రంగం సిద్ధం ? ఇవాళా ? లేదు రేపటికి ?
చంద్రబాబు తరపున వాదిస్తున్న లాయర్ లూథ్రా గురించి తెలుసా? ఈ కేసు టేక్అప్ చేస్తే?