Advertisement
తాజాగా గాంధీ అనే ఇంటిపేరు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గత ఆదివారం బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ రాహుల్ గాంధీ తన పక్కన ఉన్న గాంధీ ఇంటిపేరుని వదులుకోవాలి అంటూ కామెంట్స్ చేసారు. మన దేశ పేరుని ఇండియాకు బదులుగా భారత్ అని ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయమై బిజెపి నేతలకు, కాంగ్రెస్ నేతలకు వాగ్వాదం నడుస్తోంది. ఈ వివాదంలోనే గాంధీ ఇంటి పేరు గురించిన ప్రస్తావన కూడా వచ్చింది. భారతదేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చింది గాంధీజీ అని.. మీరు మాత్రం ఆయన పేరుని తీసుకుని.. ఇండియా అన్న పేరుని అంటగట్టారని దుమ్మెత్తిపోస్తున్నారు.
Advertisement
అసలు నెహ్రు వారసులకు గాంధీ అన్న ఇంటిపేరు ఎలా వచ్చింది? వారు గాంధీజీ ఇంటి పేరుని ఉపయోగించుకుంటున్నారు? అన్న ప్రశ్నకు పెద్ద సమాధానమే ఉంది. గాంధీజీ ఇంటి పేరుకి, నెహ్రు వారసుల పేర్ల పక్కన ఉన్న గాంధీ అన్న పేరుకు సంబంధం లేదు. నెహ్రు కుమార్తె ఇందిరా గాంధీ కుమార్తె పేరు ఫిరోజ్ గాంధీ. ఫిరోజ్ జహంగీర్ గాంధీ ఒక పార్సీ కుటుంబంలో జన్మించాడు. 1930లో కాంగ్రెస్ స్వాతంత్ర్య సమరయోధుల విభాగం లో చేరారు. ఎవింగ్ క్రిస్టియన్ కాలేజీ వెలుపల పికెటింగ్ చేస్తున్న మహిళా ప్రదర్శనకారుల మధ్య ఫిరోజ్ కమలా నెహ్రూ మరియు ఇందిరలను కలిశారు.
Advertisement
స్వతంత్ర అభిలాషతో ఉన్న ఫిరోజ్ గాంధీగారి పట్ల అభిమానం కనబరిచారు. ఆయన అడుగుజాడల్లో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో చేరడానికి 1930 లో ఆయన తన చదువుని వదిలివేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో చేరిన తర్వాత, ఫిరోజ్ ఇంటిపేరు స్పెల్లింగ్‌ను “గాందీ” నుండి “గాంధీ”గా మార్చుకున్నారు. అప్పటి నుంచి వారి వారసులకు ఇదే పేరు కొనసాగుతూ వచ్చింది. ఫిరోజ్ మొదట 1933లో ఇందిరకు ప్రపోజ్ చేశారు. కానీ ఆమె వయసు అప్పటికి 16 సంవత్సరాలు మాత్రమే ఉండడంతో ఇందిర తల్లి కమల అందుకు నిరాకరించారు. కానీ ఆయన నెహ్రూ కుటుంబానికి, ముఖ్యంగా ఇందిర తల్లి కమలా నెహ్రూతో సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో, ఇందిరా మరియు ఫిరోజ్ ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు ఒకరికొకరు మరింత దగ్గరయ్యారు. వారు మార్చి 1942లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఇలా నెహ్రు కుటుంబ వారసులకు గాంధీ ఇంటిపేరు వచ్చింది.
మరిన్ని..
బ్రూస్ లీ అంత ఫిట్ గా ఉండడానికి ఎలాంటి వర్క్ అవుట్ రొటీన్ ఫాలో అయ్యేవాడో తెలుసా..? వైరల్ అవుతున్న ఫోటో!
ఎన్టీయార్ బాలయ్య మధ్య గొడవకి కొడాలి నాని కి ఉన్న సంబంధం ఇదేనా ?