Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ.. అది ఏంటంటే.. టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం. జగన్ 2019లో అధికారంలో వచ్చారు. ఇప్పుడు ఎన్నికల ముందే ఎందుకు అరెస్ట్ చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే చంద్రబాబును జైలులో పెడతానన్నారు. ఆ వంద రోజుల టార్గెట్ ఏమైంది ? ఎన్నికలకు 6 నెలల ముందు.. మరోవైపు మూడు నెలల్లో జమిలీ ఎన్నికలు కూడా వస్తాయనుకున్న తరుణంలోనే చంద్రబాబు ని అరెస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
సీఐడీ ఇచ్చిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై ఇరు పక్షాల తరుపున వాదనలు జరిగాయి.. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇదిలా ఉండగానే.. జగన్ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ లో కుంభకోణం జరిగిందని.. 121 కోట్ల అక్రమాలు జరిగాయని సీఐడీ వాదన వినిపిస్తోంది. ఈ కేసులో కూడా చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా చేర్చడంతో పాటు పీటీ వారెంట్ ను కూడా జారీ చేశారు. ఒకవేళ ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే.. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును బయటికి రానియకుండా అటునుంచి అటే అదుపులోకి తీసుకోవాలనే ఎత్తుగడ వేశారు.
వీటిని కూడా చదవండి: చెప్పిన టైం కి రానందుకు టీడీపీ టికెట్ ఇవ్వలేదట.. ఎన్టీఆర్ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆరోజుల్లో ఏమైందంటే?
ఔటర్ రింగ్ రోడ్డు కేసులో కూడా చంద్రబాబును అరెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. దీనిపై తీర్పు రావాల్సి ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు, ఔటర్ రింగ్ రోడ్డు కేసుల్లో కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలోనే ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ అంటూ మరో కొత్త కేసును సీఐడీ అధికారులు తెరపైకి తీసుకొచ్చారు. ఇలా ఒకటి కాకపోతే.. మరొకటి.. పదుల కొద్ది కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటేనే స్పష్టంగా అర్థం అవుతోంది.
వీటిని కూడా చదవండి: చంద్రబాబు విషయంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక మాట మీదే నిలబడ్డారుగా.. ఇద్దరూ..?
ఎన్నికలు దగ్గరలో పెట్టుకొని జగన్ ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నారు. చంద్రబాబును ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేయించాలనే ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది. సీఐడీ అధికారులు కదా చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఏపీ సర్కారు అనే ప్రశ్న ఇక్కడ రాకూడదు. సీఐడీ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఓ విచారణ సంస్థ.
Advertisement
అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ జైలులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత బెయిల్ పై బయటికి రావడం.. ఎన్నికల్లో పోటీ చేయడం అన్నీ చకా చకా సాగిపోయాయి. తాను జైలులోకి వెళ్లడానికి కూడా చంద్రబాబు కూడా కారణం అని జగన్ అభిప్రాయం. ఆనాటి పగపై ప్రతీకారం తీర్చుకునేందుకు జగన్ ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయించాడా అనే అని డౌట్ అందరికీ వస్తుంటుంది.
వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవరు.. ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. చంద్రబాబును ఇబ్బందుల్లోకి నెడితే జగన్ కి తిరుగు ఉండదని ఎన్నికల ముందు అరెస్ట్ చేయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాలో జగన్ ఉన్నట్టు సమాచారం. అలాంటప్పుడు ఏరికోరి మరీ చంద్రబాబును ఇప్పుడు అరెస్ట్ ఎందుకు చేసినట్టు అని అందరి మదిలో తలెత్తుతున్న ప్రశ్న.
వీటిని కూడా చదవండి: చంద్రబాబు నాయుడుకి 7691 నంబర్ ను ఎలా ఇచ్చారు? జైల్లో ఖైదీలకు నంబర్స్ ఎలా ఇస్తారు?
సీఎం జగన్ వ్యూహం ఏంటి అనేది ఏపీ ప్రజలకు అంతు చిక్కడం లేదు. తనను ఇబ్బందుల్లోకి నెట్టిన చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనుకుంటే అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల్లోనే ఆ పని చేసేవారు. చంద్రబాబుకు ఈ కేసుల బెడద ఇప్పట్లో తీరకపోవచ్చు. ఒకదాంట్లో బయటికి వచ్చినా మరోదాంట్లో జైలులో వేసే అవకాశముంది. ఎన్నికలు దగ్గర పడేవరకు ఈ వ్యవహారాలను లాగితే..చంద్రబాబు పార్టీ పనుల మీద వర్క్ చేసే సమయం ఉండదు. దీంతో అభ్యర్థుల ఎంపిక, పార్టీ కార్యక్రమాలు మేనిఫెస్టో ఇతరెతర పనులన్నింటిలో ప్రతిపక్షం చాలా వీక్ గా ఉంటుంది. దీంతో వైసీపీ కాస్త దూకుడుగా వెళ్లవచ్చు.
మరోవైపు ఎన్నికల ముందు చంద్రబాబు జైలుకు వెళ్లితే.. చంద్రబాబు గురించి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి.. ఆయన కూడా అక్రమాలు చేశాడని జనాల్లో ప్రచారం చేయవచ్చన్నది వైసీపీ అధినేత జగన్ వ్యూహంగా భావించవచ్చు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలన్నదే సీఎం జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. రెండు, మూడు కేసుల్లో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలులో పెట్టడం వరకు ఓకే. కానీ ఒకటికి నాలుగు కేసులను లెక్క పెట్టుకొని చంద్రబాబును బయటికే రానీయకుండా ఉంటే వైసీపీకి నష్టం చేకూర్చే అవకాశం కూడా ఉంది.
ఎన్నికల ముందు జైలులో పెట్టి బయటికి రానీయకుండా చేస్తే ఇది కక్ష సాధింపే అని టీడీపీ నేతలు, కార్యకర్తలు కాదు.. సాధారణ జనాలు కూడా ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో చంద్రబాబుపై సానుభూతి క్రియేట్ అయ్యే అవకాశముంది. ఏదైతే కలిసి వస్తుందని జగన్ అనుకుంటున్నారో అది అడ్డం తిరిగి జగన్ కి ఎసరు కూడా పెట్టవచ్చు. చంద్రబాబు విషయంలో జగన్ వ్యూహం ఏంటో వేచి చూడాలి మరీ.
వీటిని కూడా చదవండి: చంద్రబాబుపై మరో కేసు: ఏమిటీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం?