Advertisement
నాగ సాధువులు అంటే ఒళ్లంతా బూడిద పూసుకుని త్రిశూలం చేతిలో పట్టుకొని బట్టలు లేకుండా అందరూ గుంపులు గుంపులుగా శివున్ని పూజిస్తూ తిరిగేవారు. వీరు మనకు ఎక్కువగా ఎక్కడ కనబడతారంటే మనం ఎప్పుడైనా కుంభమేళాకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు దర్శనమిచ్చేది నాగసాధువులే. అక్కడ ఆ సాధువులు ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా తిరగడం మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వారు అలా ఉండడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయట. అవేంటో చూద్దాం..?
Advertisement
సాధువులు అంటేనే అన్నిటినీ వదిలి ఆధ్యాత్మికం వైపు తన మనసును మళ్ళించు కొని జీవితం మొత్తం అలాగే ఉండటం. ఆధ్యాత్మికత అంటే దేవుని గురించి ఎప్పుడు పరితపిస్తూ, నిత్యం భక్తితో ఉండడం. ఎప్పుడు పూజ చేస్తూ జ్ఞానోదయం కోసం ధ్యానం చేస్తూ ఉంటారు. మరి వారు ఎందుకు దుస్తులను ధరించరు అంటే.. కొన్ని ఆధారాల ప్రకారం చూస్తేనాగ అంటే నగ్నం.. ఈ సాధువులు పూర్తిగా వియోగంను పాటిస్తారు.
Advertisement
వారు పూర్తిగా అందరితో వేరుచేయబడి ఉంటారు. అంటే ఒక సాధువు వారి కుటుంబం మరియు స్నేహితులతో అన్ని బంధాలను పూర్తిగా తెంచుకొని జీవిస్తాడు. వీరు ఒక్క ప్రదేశంలో ఉండాలని కోరుకోరు.. వివిధ ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు. ఇల్లు అంటూ ఏమీ ఉండదు. వారు ఆహారాన్ని కూడా కేవలం జీవించడం కోసం మాత్రమే తింటారు. సాధారణంగా ధ్యానం లేదా ఆధ్యాత్మిక విధానంలోనే గడుపుతారు. వారికి బట్టలు లేకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. చలి కానీ, ఎండ కానీ, వాన అనే విషయాలను వీరు పట్టించుకోరు కాబట్టి ఏమి ధరించకుండా కూడా జీవించగలుగుతారు.