Advertisement
మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్ అవుతాడని జూనియర్ ఎన్టీఆర్ కి ఏడాది ముందే తెలుసా ? తన మేనత్త భర్తను అరెస్ట్ చేసి జైలులో ఉంచిన నందమూరి కుటుంబం అంతా చంద్రబాబుకు మద్దతు పలికినా తన తాతయ్య పెట్టిన పార్టీకి ఆపద ముంచుకొచ్చినా నిలువెత్తు కష్టాల్లో టీడీపీ ఉన్నా సరే ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ నుంచి రెస్పాన్స్ లేదు. ఒకటంటే ఒక్క మెసేజ్ కూడా సోషల్ మీడియాలో ఎందుకు పెట్టలేకపోతున్నారు. ఎన్టీఆర్ ని ఆపుతున్న బలమైన శక్తి ఎవరు వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
వీటిని కూడా చదవండి: చంద్రబాబు అరెస్ట్ తరువాత పవన్ చేసిన అతి పేద్ద తప్పు ఇదేనా ?
వీటిని కూడా చదవండి: ఢిల్లీకి ఏపీ సిఐడి పోలీసులు… నారా లోకేష్ అరెస్టు ఖాయమేనా ?
ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ఇలా ఎవ్వరూ ఎలాగైనా సరే.. రాజకీయాల పరంగా తనను దూరం పెట్టినా.. సందర్భాలు వచ్చినప్పుడల్లా ఆలస్యంగా అయినా సరే రెస్పాండ్ అయ్యేవారు. భువనేశ్వరి గారి అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు నీచంగా మాట్లాడారని గొడవ జరిగినప్పుడు.. జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అయ్యారు. విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మార్చినప్పుడు కూడా ఎన్టీఆర్ రెస్పాండ్ అయ్యారు. గతంలో కొడాలి నాని వంటి వారు పార్టీ మారినప్పుడు కూడా కట్టే కాలే వరకు టీడీపీ కార్యకర్తగానే ఉంటానని క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్. సందర్భం వచ్చినప్పుడల్లా కాస్తో.. కూస్తో ఆలస్యగానైనా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్.. చంద్రబాబు అరెస్ట్ అయి ఇన్ని రోజులు గడిచినా ఎందుకు స్పందించడం లేదనేది డౌట్ అందరికీ కలుగుతుంది. ఆయనను ఏదో బలమైన శక్తి ఆపుతుందనేది తెలుస్తుంది.
Advertisement
వీటిని కూడా చదవండి: చంద్రబాబు కి హైకోర్టు బెయిల్ ఎందుకు ఇవ్వలేదు..? అసలు కారణం ఇదే..!
సరిగ్గా ఏడాది కిందట కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఏరికోరి మరీ జూనియర్ ఎన్టీఆర్ ని పిలిపించుకున్నారు. కాసేపు మాట్లాడుకొని పంపించేశారు. అసలు వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారు. ఏయే అంశాలు చర్చకు వచ్చాయనేది ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా బయటపెట్టలేదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా దీని గురించి మాట్లాడినట్టు కనిపించడం లేదు. RRR సినిమా విషయంలో మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ ని పిలిచారని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఏడాది క్రితం జరిగిన భేటీలోనే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ కి హింట్స్ ఇచ్చి ఉంటారేమో.. భవిష్యత్ లో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా మీరు అటువైపు వెళ్లద్దనో.. చంద్రబాబును అరెస్ట్ చేసినా మీ నుంచి ఏ స్పందన ఉండవద్దనో.. ఇలా ఏదో ఓ రకంగా ఎన్టీఆర్ కి అసలు విషయాన్ని అమిత్ షా గారు అప్పుడే చెప్పి ఉంటారు. అదేంటి చంద్రబాబును అరెస్ట్ చేయించింది జగన్ కదా.. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే.. అసలు సూత్రదారులు బీజేపీ అధిష్టానమే అనే విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. ప్రతీ టీడీపీ కార్యకర్తకి కూడా తెలుసు. కానీ ఎవ్వరూ బయటికి చెప్పుకోలేకదిగమింగుతున్నారు.
వీటిని కూడా చదవండి: ముఖ్యమంత్రి అయ్యాక సీనియర్ ఎన్టీఆర్ ఎల్లప్పుడూ కాషాయం దుస్తులు ఎందుకు ధరించారు? అసలు కారణం ఇదే!