Advertisement
మహాలక్ష్మి మరియు రవీందర్ చంద్రశేఖర్ ల వివాహం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. డబ్బు కోసమే రవీందర్ ను పెళ్లి చేసుకుంది అంటూ మహాలక్ష్మి పై కామెంట్స్ వెల్లువెత్తాయి. ఇప్పటికీ.. ఆమె పై ఈ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఓసారి రవీందర్ తన సోలో చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని పుకార్లు వ్యాపించాయి. అయితే ఒకే ఒక్క పోస్ట్ తో రవీందర్ ఈ పుకార్లన్నీ అవాస్తవాలని పేర్కొన్నారు. తాము సంతోషంగా ఉండే జంట అని చెప్పకనే చెప్పాడు.
Advertisement
ఐవి కూడా చదవండి: తెలుగు ప్రజలకి బాబు భార్య ఓపెన్ లెటర్ ! అందులో ఏముందంటే ? ఆమె మాటలు నిజమే కదా ??
ఐవి కూడా చదవండి: చంద్రబాబు అక్టోబర్ 1 నే విడుదల అవ్వబోతున్నారా? ఆ రోజే ఎందుకంటే ?
Advertisement
అయితే, ఈ ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ రీసెంట్ గా ఓ ఫ్రాడ్ కేసులో అరెస్ట్ అయ్యారు. వ్యాపారి చేతిలో రూ.16 కోట్లు చోరీకి గురైనట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు. తన భర్త మోసం కేసులో అరెస్ట్ అయిన ఘటనపై నటి మహాలక్ష్మి సోషల్ మీడియా ద్వారా తన స్పందనని కూడా తెలియ చేసారు. ఈ కాలం కూడా త్వరగా గడిచిపోతుంది.. అంటూ ఆమె తన భర్త అరెస్ట్ గురించి స్పందించారు. ఇప్పటికే ఆమె తన భర్తకి బెయిల్ తీసుకురావడం కోసం పలు ప్రయత్నాలు కూడా చేశారు.
ఐవి కూడా చదవండి: తెలుగు ప్రజలకి బాబు భార్య ఓపెన్ లెటర్ ! అందులో ఏముందంటే ? ఆమె మాటలు నిజమే కదా ??
అయినప్పటికీ బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దీనితో రవీందర్ జైలు లోనే ఉన్నారు. ఇటీవల కాలంలో మహాలక్ష్మి ఓ రీల్ ను తన ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. దీనితో మరోసారి ఆమెపై కామెంట్ల వర్షం కురిసింది. ఓ వైపు భర్త జైలులో ఉంటె.. నీవు ఇలా ఎంజాయ్ చేస్తున్నావా? డబ్బు కోసమే నువ్వు రవీందర్ ని పెళ్లి చేసుకున్నావ్ అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.