Advertisement
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత… టిడిపి గ్రాఫ్ పెరిగిందని చెప్పవచ్చు. మొన్నటి వరకు వైసిపి మంచి లీడింగ్ లో ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు అరెస్టు అయ్యాడో… అప్పటినుంచి ఏపీ ప్రజల్లో కాస్త సింపతి పెరిగినట్లు సి ఓటర్ సర్వే కూడా స్పష్టం చేసింది. ఇలాంటి తరుణంలో స్వయంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు.
Advertisement
టిని కూడా చదవండి: ముఖ్యమంత్రి అయ్యాక సీనియర్ ఎన్టీఆర్ ఎల్లప్పుడూ కాషాయం దుస్తులు ఎందుకు ధరించారు? అసలు కారణం ఇదే!
జైలు నుంచి బయటికి వచ్చి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు జనసేనాని పవన్ కళ్యాణ్. దీంతో తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ ప్రకటనతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ తన వైఖరి ఏంటో చెప్పాడని… తాము పొత్తులపై కేంద్ర నాయకత్వంతో చర్చిస్తున్నామని పురందరేశ్వరి వివరించారు.
Advertisement
ఇవి కూడా చదవండి: చంద్రబాబుకు షాక్… ఏసీబీ కోర్టులో సిఐడి అధికారుల మరో పిటిషన్ ?
ఇవి కూడా చదవండి: పవన్ కళ్యాణ్ కి అతి పెద్ద పరీక్ష ! ఇది నిజంగా ఒక పెద్ద సమస్యే !
అలాగే టిడిపి, జనసేన, బిజెపి పార్టీల పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర బిజెపితో చర్చలు జరుపుతారని పురంధరేశ్వరి వెల్లడించారు. తమ అభిప్రాయాలు కూడా కేంద్ర నాయకత్వం అడుగుతుందని… చివరగా తమ అగ్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న మేము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు పురంధరేశ్వరి. టిడిపి జనసేన, బిజెపి పొత్తులకు కేంద్ర అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే… తాము పార్టీ లైన్ కు కట్టుబడి ఉంటామని వెల్లడించారు. ఇక పొత్తులపై పురందరేశ్వరి చేసిన తాజా ప్రకటనతో తెలుగుదేశం తమ్ముళ్లకు కొత్త ఊపిరి వచ్చినట్లు అయింది. మూడు పార్టీలు కదిలిస్తే… ఖచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని పడగొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.