Advertisement
మనలో ప్రతి ఒక్కరికి కలలు రావడం అనేది సహజం. మనం ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో అవే మనకి కలలుగా కూడా వస్తూ ఉంటాయి. కొన్ని భవిష్యత్ లో జరగబోయే సంఘటనలు కూడా కలలుగా వస్తూ ఉంటాయి. మనం ఏదైనా కల వచ్చిన వెంటనే మన పక్కన వాళ్ళకి చెప్పేస్తూ ఉంటాం. కానీ స్వప్న శాస్త్రం ప్రకారం ఇలా చేయకూడదట. కొన్ని కలలను వచ్చిన వెంటనే ఇతరులకు చెప్పకూడదట. అలా చెప్పడం వలన వాటి ప్రాధాన్యత తగ్గుతుందట. ఇంతకీ ఆ కలలు ఏమిటో చూద్దాం.
Advertisement
మీకు కలలో వెండి కలశం కనిపిస్తే.. దాని గురించి పొరపాటున కూడా ఎవరికీ చెప్పకండి. కలలో వెండి కలశం కనిపిస్తే దాని అర్ధం.. మీకు భవిష్యత్ లో మంచి జరగబోతోందని అర్ధం. ఈ కల మీ జీవితంలో మంచి రోజులు రావడానికి సంకేతం. మీ కష్టాలు తొందరలోనే తీరబోతున్నాయని అర్ధం. ఈ కలను ఎవ్వరికీ చెప్పకండి. ఒకవేళ, చెబితే మీ కల నెరవేరదు. అలాగే మరణానికి సంబంధించిన కల కూడా ఎవరికీ చెప్పకండి. మీరు చనిపోయినట్లు.. లేదా మీ సన్నిహితులు ఎవరైనా చనిపోయినట్లు కల వస్తే ఎవ్వరికీ చెప్పకండి.
Advertisement
ఇలాంటి కలలు వస్తే వారికి ఆయుర్దాయం మరింత ఎక్కువగా ఉంటుందని అర్ధం. వారికి మంచి జరుగుతుందని అర్ధం. అయితే ఇలాంటి కలలు ఇతరులకు చెప్పడం వలన దాని ప్రభావం తగ్గిపోతుంది. అలాగే.. కలలో పూల తోట కనిపిస్తే అది మీ ఆర్థిక అభివృద్ధికి సంకేతం. ఈ కలను కూడా ఎవ్వరికీ చెప్పకండి. మీకు సమాజంలో మరింత గౌరవం పెరుగుతుందని, మీ సంపద పెరుగుతుందని ఈ కళకి అర్ధం. అయితే.. దీనిని ఇతరులకు చెప్పడం వలన ఆ కల నెరవేరే అవకాశాలు తగ్గిపోతాయి.
మరిన్ని..
బిఆర్ఎస్ నేతలు చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేయడం వెనుక అసలు రాజకీయ కారణం అదేనా?
AP CID అడిగిన పది ప్రశ్నలు ఇవేనా? చంద్రబాబు నాయుడికి ఎదురైన ఆ ప్రశ్నలు ఏంటంటే?
ప్రధాని మోడీజి తినే ఈ పరోటాలు తింటే.. ఈ రోగాలు పొరపాటున కూడా మీ దరి చేరవు!