Advertisement
ప్రేమలో పడడానికి వయసుతో సంబంధం లేదని అంటుంటారు. ఎవరికీ ఎప్పుడు ఎవరిపై ప్రేమ కలుగుతుందో చెప్పడం కష్టం. 70 ఏళ్ల కెనడియన్ మహిళతో ప్రేమలో పడిన 35 ఏళ్ల పాకిస్థానీ అబ్బాయి స్టోరీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. డైలీ పాకిస్తాన్ సైట్ కథనం ప్రకారం.. డెబ్బయ్యేళ్ళ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యువకుడి పేరు నయీమ్ షాజాద్. ఇతను కేవలం డబ్బు కోసమే ఈ పెళ్లి చేసుకున్నాడు అంటూ నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
ఆమె ఆస్తి చూసి పెళ్లి చేసుకుంటున్నాడన్న కారణంతో ఈ యువకుడిని గోల్డ్ డిగ్గర్ అని పిలుస్తున్నారు. ఈ యువకుడు ఇటీవల ఓ మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ వీడియో వైరల్ అవుతోంది. అందులో అతను మేరీని ఎలా కలిశాడో మరియు వారిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారో చెప్పాడు.మొదట్లో ఇద్దరూ మంచి స్నేహితులని నయీమ్ చెప్పాడు. అయితే క్రమంగా ఈ స్నేహం ప్రేమగా మారింది. అతను 2012లో ఫేస్బుక్లో మేరీని కలిశాడు. వీరి ప్రేమకు నయీమ్ సన్నిహితులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారట.
Advertisement
. ఫేస్బుక్లో తనను కలిసిన మూడేళ్లకే మేరీ అతడికి ప్రపోజ్ చేసిందని నయీమ్ పేర్కొన్నాడు. ఆ తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నారు. వీసా రాకపోవడంతో మేరీతో కలిసి నయీమ్ కెనడాలో ఉండలేకపోయాడు. అయితే ఇప్పుడు మేరీకి పాకిస్థాన్ వీసా వచ్చింది. రీసెంట్గా పాకిస్థాన్‌కు వచ్చిన ఆమె.. ఆరు నెలల పాటు ఇక్కడే ఉండేందుకు ప్లాన్ చేస్తోంది. వివరాల ప్రకారం మేరీ తన పెన్షన్ తో జీవిస్తోంది. అవసరం అయితే.. తన భర్తకు డబ్బు సాయం కూడా చేస్తోంది. దీనితో అందరు కేవలం డబ్బు కోసమే నయీమ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.