Advertisement
ప్రపంచ అత్యధిక ధనికుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీల తనయుడు అనంత్ అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే.. అయన ఊబకాయం సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఫోటోలలో ఎక్కడ చూసినా అధిక బరువుతో ఉన్న ఫొటోలే దర్శనం ఇస్తాయి. ఆయన బరువు తగ్గించడం కోసం ముఖేష్ అంబానీ కూడా చాలా ప్రయత్నాలే చేసారు. అయితే ఓసారి ఏకంగా అనంత్ అంబానీ 108 కేజీల బరువు తగ్గి చాలా స్లిమ్ గా ఫిట్ గా కనిపించారు.
Advertisement
ఈ ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి. అయితే.. అనంత అంబానీ ఒక్కసారిగా అంత వెయిట్ ఎలా తగ్గారు? అన్న సందేహం చాలామందికి ఉంది. ఆయనకు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు? ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు అన్న విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. అనంత్ అంబానీకి ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనర్ పేరు వినోద్ చన్నా. ముంబైకి చెందిన ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్లలో ఒకరు. కేవలం 18 నెలల్లోనే అనంత్ అంబానీ 108 కిలోల బరువు తగ్గడంతో వినోద్ చన్నా ఫేమస్ అయ్యాడు. వినోద్ చన్నా అనంత్ అంబానీ కోసం రూపొందించిన ఇంటెన్సివ్ డైట్ మరియు వర్కౌట్ ప్రోగ్రామ్ కారణంగా ఈ అద్భుతమైన లక్ష్యాన్ని సాధించడంలో అనంత్ విజయం సాధించారు.
ఫిట్నెస్ ట్రైనర్‌గా మారడానికి ముందు, వినోద్ చన్నా తన జీవితంలో హౌస్ కీపింగ్ మరియు సెక్యూరిటీ గార్డుగా కూడా ఉద్యోగాలు చేశాడు. ఒక మంచి రోజు వినోద్ చన్నా తన శరీరాకృతిపై దృష్టి పెట్టాలని గ్రహించాడు మరియు అతను జిమ్‌లో చేరి శరీరంపై దృష్టి పెట్టి చరిత్ర తిరగరాశారు.
Advertisement
వినోద్ చన్నా బిజినెస్ ఇన్‌సైడర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖేష్ అంబానీ కొడుకు బరువు తగ్గడంపై పూర్తిగా దృష్టి పెట్టాడని మరియు అనంత్ అంబానీ తన డైట్ ని ఫాలో అవ్వడం అంత సులభం ఏమీ కాదని తెలిపారు. అనంత్ ఎక్కువగా జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. దీనితో చన్నా ఆయన ఫుడ్ హ్యాబిట్స్ పై దృష్టి పెట్టారు. ఇందులో ప్రోటీన్, తక్కువ కార్బ్ మరియు ఫైబర్ ఉన్నాయి.
అనంత్ అంబానీతో పాటు, నీతా అంబానీ, కుమార్ మంగళం బిర్లా, అనన్య బిర్లా మొదలైన వ్యాపార దిగ్గజాలకు వినోద్ చన్నా వ్యక్తిగత శిక్షకుడు మరియు పలువురు బాలీవుడ్ ప్రముఖులైన జాన్ అబ్రహం, శిల్పా శెట్టి కుంద్రా, హర్షవర్ధన్ రాణే, వివేక్ ఒబెరాయ్, అర్జున్ రాంపాల్ మొదలైన వారికి కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన 12 సెషన్లకు రూ. 1.5 లక్షలు వసూలు చేస్తారు.
మరిన్ని..
కొంతమంది మగవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అసలు కారణాలు ఏంటో తెలుసా? ఓ లుక్ వేయండి..!
నారా లోకేష్‌పై సీఐడీ కేసు.. 14వ నిందితుడిగా చేరుస్తూ పిటిషన్..