Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు పెద్దగా హేటర్స్ లేని స్టార్ హీరో ఎవరు? అంటే టక్కున గుర్తొచ్చే పేరు వెంకటేష్. ఇండస్ట్రీ కి వచ్చి చాలా కాలం అవుతున్నా ఆయనపై ఇప్పటివరకు పెద్దగా రూమర్స్ లేదా వివాదాస్పద న్యూస్ వచ్చిన దాఖలాలు లేవు. ఆయన తన ప్రైవేట్ లైఫ్ ను చాలా గోప్యంగా ఉంచుతారు. ఒక మంచి మనసు ఉన్న వ్యక్తిగా వెంకటేష్ కు ఇండస్ట్రీలో చాలా మంచి పేరే ఉంది. అయితే.. ఆయన ఫామిలీ లైఫ్ గురించి మాత్రం చాలా మందికి తెలియదు.
Advertisement
వెంకటేష్ భార్య పేరు నీరజ. ఆమె తల్లి తండ్రులు గంగవరపు వెంకటసుబ్బారెడ్డి ఉషారాణిలు. వీరిది చిత్తూరు జిల్లాలోని మదనపల్లి. వీరి కుటుంబం జమీందారీ కుటుంబం అని టాక్ ఉంది. వెంకటేష్ భార్య నీరజ తండ్రి భూస్వామి అట. ఆయనకు భూమి మాత్రమే కాదు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయట. ఆయనకు మదనపల్లిలో బాగా పేరు, పలుకుబడి ఉన్నాయట. ఒకసారి రామానాయుడు వెంకటేష్ కు పెళ్లి చేయడానికి అమ్మాయిని చూడాలి అని విజయ నాగిరెడ్డికి చెప్పడంతో నీరజ గురించి చెప్పారట.
Advertisement
నీరజ మదనపల్లిలో సిఎస్ఐ గర్ల్స్ కాలేజీలో చదివారట. ఆ తరువాత వి.టి కాలేజీలో చదువుకున్నారట. ఆ తరువాత ఆమె ఎంబీఏ కూడా చేశారట. అయితే.. వీరి కుటుంబం గురించి నాగి రెడ్డి చెప్పడంతో రామానాయుడు మదనపల్లి వెళ్లి నీరజను చూశారట. ఆ తరువాత పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేశారట. ఇద్దరూ ఒకరినొకరు నచ్చడంతో 1989 వ సంవత్సరంలో వీరిద్దరికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారట. వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోయింది. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే.. సిబిఎం క్యాబినెట్ లో హెల్త్ మినిస్టర్ గా పని చేసిన కామినేని శ్రీనివాస రావు నీరజకు మేనమామ అవుతారు.
మరిన్ని..
Bhagath Singh: భగత్ సింగ్ చెప్పిన ఈ ఆఖరు మాటలు వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది..!
చంద్రబాబు అరెస్ట్ పై “సీ ఓటర్ సర్వే” లో సంచలన విషయాలు వెలుగులోకి..!
గుడివాడలో టీడీపీ గెలుస్తుందా..? సర్వేలు ఏం చెబుతున్నాయంటే..?