Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం పై చాలా చోట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పలువురు నేతలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ రాజధానిలో కూడా ఈ వేడి గట్టిగానే తగులుతోంది. ఇక ఐటి పార్క్ వద్ద కూడా కొందరు ఉద్యోగులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై తమ వ్యతిరేకతను ర్యాలీల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేటీఆర్ స్పందించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఐటి కారిడార్ లో ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదని, ఇక్కడ లేని పంచాయతీని ఎందుకు పెడుతున్నారని కేటీఆర్ గట్టిగానే స్పందించారు.
Advertisement
సిబిఎన్ అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన విషయం అని.. దానికై తెలంగాణాలో నిరసనలు చేయాల్సిన అవసరం ఏముందని కేటీఆర్ స్పష్టంగా ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కూడా తెలంగాణాలో దుమారం రేగుతోంది. కేటీఆర్ వ్యాఖ్యలకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ వేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై నిరసన చేస్తే తప్పు ఏంటో చెప్పాలన్నారు. ఆంధ్ర ప్రజల ఓట్లు కావాలి కానీ, వారి బాధ, నిరసనలు అవసరం లేదా అని ప్రశ్నించారు.
Advertisement
చంద్రబాబు దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు అని.. ఆయన అరెస్ట్ ఏపీకి మాత్రమే ఎందుకు పరిమితం అవుతుందని అన్నారు. అమెరికాలో కూడా ఆయన అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారు ఉన్నారన్నారు. ఏదైనా అనేముందు.. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అని గుర్తుంచుకోవాలని అన్నారు. ఆయన అరెస్ట్ పై నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. ఆయనలా అనుభవం ఉన్న నేతలను వేళ్ళపై లెక్కపెట్టవచ్చని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ రాజకీయ నాయకులలో చంద్రబాబు నాయుడు బిగ్ పర్సనాలిటీ అంటూ కామెంట్ చేసారు.
మరిన్ని..
స్కంద సినిమాకు అదే మైనస్ అయ్యిందా? లేకుండా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకునేదా?
స్కంద మూవీ లో సీఎం జగన్ ను టార్గెట్ చేసారా? ఈ పొలిటికల్ డైలాగ్స్ ఏంటి బోయపాటి అన్నా?
Chandramukhi Review: మొదటి పార్ట్ కంటే ”చంద్రముఖి 2” బాగుందా..? కథ, రివ్యూ అండ్ రేటింగ్…!