Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం పై చాలా చోట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పలువురు నేతలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ రాజధానిలో కూడా ఈ వేడి గట్టిగానే తగులుతోంది. ఇక ఐటి పార్క్ వద్ద కూడా కొందరు ఉద్యోగులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై తమ వ్యతిరేకతను ర్యాలీల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేటీఆర్ స్పందించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఐటి కారిడార్ లో ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదని, ఇక్కడ లేని పంచాయతీని ఎందుకు పెడుతున్నారని కేటీఆర్ గట్టిగానే స్పందించారు.
Advertisement
ఈ విషయమై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. తెలంగాణాలో ఎక్కడా శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా టీడీపీ అభిమానులు ప్రవర్తించలేదని.. అయినా అంత భయం దేనితో నాకు అర్ధం కాలేదని నారా లోకేష్ అన్నారు. ఏపీలో టీడీపీ నేతల అరెస్ట్ విషయం గురించి ఆయన ఢిల్లీ లోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేసారు. ఆ తరువాత లోకేష్ మీడియాతో మాట్లాడారు.
Advertisement
తమ నాయకుడు సిబిఎన్, యువగళంలో తానూ, వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్ ప్రజలలో చైతన్యం తీసుకొస్తున్నామని.. అందుకే జగన్ అందరిని అరెస్ట్ చేయిస్తున్నారని వ్యాఖ్యానించారు. రెండు రోజులు కస్టడీలోకి తీసుకున్న సిబిఐ అధికారులు ఆధారాలు ఇవ్వాలంటూ వేడుకున్నారని.. ఆ ఆధారాలు ఉంటె మీడియా ముఖంగా ఎందుకు చూపించడం లేదు అని ప్రశ్నించారు. ఏ కంపెనీ దగ్గరా కప్పు కాఫీ కూడా తాగని అవినీతి చేశామని ఎలా అంటారన్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ విషయమై ప్రతి అంశానికి ఓ వెబ్సైట్ ప్రారంభిస్తున్నామని అన్నారు. యువగళం పాద యాత్ర చేసి తీరుతానని.. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇరికించారని.. ప్రజలంతా చూస్తూనే ఉన్నారని అన్నారు.
మరిన్ని..