Advertisement
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ వయసుతో పని లేదు. ఏ వయసుని మేకప్ యిట్టె కవర్ చేసేస్తుంది. అందుకే నటీనటులు కూడా తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంటారు. హీరోల సంగతి ఎలా ఉన్నా.. హీరోయిన్ల విషయం వచ్చేసరికి ఒక వయసు వచ్చాకా వారికి వచ్చే అవకాశాలు కూడా మారిపోతూ ఉంటాయి. మొదట్లో హీరోయిన్స్ గా చేసినా.. తర్వాత్తర్వాత వారు క్యారక్టర్ ఆర్టిస్ట్స్ గా చేస్తుంటారు. చెల్లిగా, వదినగా నటిస్తూ ఉంటారు. ఇంకా వయసు ఎక్కువ అయితే.. తల్లి పాత్రలను కూడా చేస్తుంటారు.
Advertisement
ఇవి కూడా చదవండి: నాని సినిమాలో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందో. ఏమి చేస్తోందో చూడండి!
ఒక సీనియర్ నటి మాత్రం మెగాస్టార్ చిరంజీవి పక్కన స్టెప్పులేశారు. ఆ తరువాత చిరంజీవికి చెల్లిగా నటించారు. అంతే కాదు.. మరో సినిమాలో తల్లిగా కూడా నటించి మెప్పించారు. ఇంతకీ ఆ సీనియర్ నటి ఎవరో కాదు. ఆమె పేరు సుజాత. కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ, మలయాళ భాషల్లో స్టార్ హీరోల అందరితో జతకట్టారు. మొత్తంగా ఆమె మూడు వందల సినిమాలకు పైగా నటించారు. 1980 లో కృష్ణంరాజు, చిరంజీవి కాంబోలో వచ్చిన సినిమా ప్రేమ తరంగాలు. ఈ సినిమాలో సుజాత చిరుకు జోడీగా నటించారు.
Advertisement
ఇవి కూడా చదవండి: నాని సినిమాలో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందో. ఏమి చేస్తోందో చూడండి!
ఇవి కూడా చదవండి: కేసీఆర్, ఎన్టీఆర్ లే మంచి సీఎంలు… మిగతా అందరూ బ్రోకర్లే.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి!
మరో రెండేళ్ల తరువాత సీతాదేవి సినిమా వచ్చింది. ఈ సినిమాలో సుజాత చిరంజీవికి చెల్లెలిగా నటించారు. ప్రియురాలు కాస్త చెల్లెలు అయిపోయింది అని అప్పట్లో అనుకున్నారు. మరో పదమూడు సంవత్సరాలు తిరిగేసరికి సుజాత చిరుకు తల్లిగా కూడా నటించారు. 1995 వ సంవత్సరంలో వచ్చిన బిగ్ బాస్ మూవీ లో చిరంజీవికి తల్లిగా కనిపించారు సుజాత. చిరుకు చెల్లెలిగా నటించిన హీరోయిన్స్ ఉన్నారు.. కానీ హీరోయిన్ గా, చెల్లిగా, చివరకు అమ్మగా కూడా నటించిన ఏకైక నటి సుజాత గారు.