Advertisement
చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ 2005 లో విడుదల అవగా.. దాదాపు పదిహేను సంవత్సరాల తరువాత సీక్వెల్ వస్తోంది. ఈ సినిమా మొదటి పార్ట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించారు. ఈ సినిమా ఆయన హిస్టరీ లో తిరుగులేని సినిమాగా నిలిచిపోయింది. రజిని చరిష్మా, జ్యోతిక యాక్టింగ్, హారర్ జోనర్ లో ఉన్న ప్రత్యేక కథనం.. వెరసి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపే రికార్డులు సృష్టించింది.
Advertisement
ఇవి కూడా చదవండి: అక్టోబరు 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న“మధురపూడి గ్రామం అనే నేను”
ఇప్పటి యూత్ అంతా ఫస్ట్ పార్ట్ టైం లో చిన్న పిల్లలు. వారికి సుస్సు పోయించింది ఈ సినిమా. చిన్నా, పెద్దా అందరిని ఆకట్టుకున్న ఈ సినిమా నుంచి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది అంటే.. ఏ రేంజ్ లో బజ్ ఉండాలి? కానీ, ఈ సినిమా సీక్వెల్ కి అది మిస్ అయినట్లు అనిపిస్తోంది.
సెకండ్ పార్ట్ లో హీరోగా నటిస్తున్న రాఘవ లారెన్స్ టాలెంట్ కి ఏ వంకా పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన గతంలో పలు హారర్ జోన్ సినిమాల్లోనూ నటించారు. ఈ సీక్వెల్ ను పి వాసు డైరెక్ట్ చేస్తున్నారు. మొదటి పార్ట్ ని కూడా పి. వాసునే డైరెక్ట్ చేసారు.
Advertisement
ఇవి కూడా చదవండి: మెగాస్టార్ చిరంజీవి పక్కన స్టెప్పులేసి.. ఆ తర్వాత చెల్లిగా, తల్లిగా నటించిన ఈ సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా?
అయినప్పటికీ ఈ సినిమాలో చిన్న లాజిక్ మిస్ అయ్యారు. ఈ సినిమాలో చంద్రముఖి గతం గురించి ఉంటుంది. నిజానికి పి వాసు డైరెక్ట్ చేసిన నాగవల్లి సినిమాలో కూడా చంద్రముఖి గతం ఉంటుంది. ఇందులో చంద్రముఖిగా అనుష్కని చూపించారు. ఆమె రిచా ని ఆవహించినట్లు చూపించారు. ఫస్ట్ పార్ట్ లో ఒరిజినల్ చంద్రముఖిని చూపించలేదు. ఆమె జ్యోతికని ఆవహించినట్లు మాత్రమే చూపారు.
అసలు చంద్రముఖిని చూపించింది మాత్రం నాగవల్లి సినిమాలోనే. ఆ సినిమాలో అనుష్కనే నాగవల్లిగా చూపించారు. మరి ఇప్పుడు తీసిన సీక్వెల్ లో మాత్రం చంద్రముఖిగా కంగనా ని చూపించారు. అనుష్క చంద్రముఖి అయితే.. కంగనని ఎందుకు చూపారు? అన్ని సినిమాలకి డైరెక్టర్ ఒక్కరే అయినా.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని..
బన్నీ- శ్రీజ కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అయ్యిందని తెలుసా? ఒకవేళ వీరిద్దరూ చేసి ఉంటే..?