Advertisement
ఒకప్పుడు పెళ్లి అంటే ఎక్కువగా అరేంజ్డ్ మ్యారేజెస్ ఉండేవి. వీటిలో పెద్దలు వయసు వ్యత్యాసం చూసి పెళ్లి చేసేవారు. ఆడవాళ్ళ కంటే మగవాళ్ల వయసు కొంత ఎక్కువ ఉండేలా చూసుకునేవారు. ఇటీవల కాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కంటే ప్రేమ పెళ్లిళ్లే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ప్రేమ పెళ్లిళ్లలో వయసు వ్యత్యాసానికి పెద్దగా ప్రాముఖ్యత ఉండడం లేదు. అబ్బాయిలు తమ కంటే కొంత వయసు ఎక్కువగా ఉన్న అమ్మాయిలను ఇష్టపడితే.. వారిని పెళ్లి చేసుకోవడానికి ఏమీ ఆలోచించడం లేదు. కానీ దీని వలన కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Advertisement
ఇవి కూడా చదవండి: చంద్రముఖి సీక్వెల్ కి కూడా సేమ్ డైరెక్టర్.. కానీ ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు?
ఇవి కూడా చదవండి: అక్టోబరు 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న“మధురపూడి గ్రామం అనే నేను”
ఇంతకీ ఆ ఇబ్బ్బందులు ఏమిటో ఈ ఆర్టికల్ లో చూద్దాం. సాధారణంగా అబ్బాయిల తల్లి తండ్రులు కానీ, అమ్మాయిల తల్లి తండ్రులు కానీ భర్త వయసు భార్య వయసు కంటే తక్కువగా ఉంటె ఒప్పుకోరు. అందుకే ఇలాంటి పెళ్ళిళ్ళను పెద్దలను ఒప్పించి చేసుకోవడం కష్టమే అవుతుంది. ఇక వైవాహిక బంధం మొదలయ్యాక అబ్బాయిలకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏ విషయం అయినా ఆమె ఒప్పుకుంటే చెయ్యాల్సి వస్తుంది. వయసు కారణం కావచ్చు, లేదా ఆమె ముందుగానే కెరీర్ లో సెటిల్ అయ్యి ఉండడం కావచ్చు.. ఏ నిర్ణయంలో అయినా ఎక్కువగా అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. వీటిని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సి వస్తుంది.
Advertisement
సాధారణంగా వివాహ బంధాల్లో భర్తదే పైచేయిగా ఉండడం, భర్తే భార్యని కంట్రోల్ చేస్తున్నట్లు ఉండడం జరుగుతుంది. ఈ తరహా విధానాలకు అబ్బాయిల మైండ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కానీ అమ్మాయి వయసు ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఆమె ఆలోచనలు, పనులు భర్తని డామినేట్ చేసేలా లేదా కంట్రోల్ చేసేలా ఉంటాయి. ఈ తీరు వలన కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. నిజానికి స్వచ్ఛమైన ప్రేమ ఉంటె కులం, వయసు, మతం, ఆస్తి అంతస్తుల తారతమ్యాలు ఏవీ కానరావు. అందుకే వివాహ బంధంలోకి అడుగు పెట్టె ముందు మీ ప్రేమ స్వచ్చతని పరీక్షించుకోండి. అన్నివిధాలుగా ఆలోచించుకుని అడుగెయ్యండి. ప్రేమ ఉన్న చోట ఇవన్నీ సమస్యలే కాదు. కాబట్టి మీ జీవితంలోకి వచ్చింది ఎవరైనా స్వచంగా ప్రేమించండి.