Advertisement
ఈరోజుల్లో లవ్ రిలేషన్స్, లివ్ ఇన్ రిలేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ప్రేమకి ఉన్న అర్ధం, తీరు మారిపోయాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లవ్ ట్రెండ్స్ ని చూస్తుంటే పేరెంట్స్ గుండెల్లో రాయి పడుతోంది. ఇక అమ్మాయిలు, అబ్బాయిల సంగతి సరే సరి. వారు తమని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా వట్టి నాటకమేనా అన్న సందేహాలు కలగడం సాధారణం. అయితే.. ఈ ఆర్టికల్ అమ్మాయిల కోసం. మీరు ప్రేమిస్తున్న అబ్బాయి మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నాడో లేదో ఈ ఆర్టికల్ చూసి తెలుసుకోండి.
Advertisement
మీ ప్రేమికుడు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే మీ అభిప్రాయాలకు గౌరవం ఇస్తాడు. మీరు చెప్పిన విషయాలకు ఆలోచన చేస్తారు. తన కోసం తీసుకునే జీవిత నిర్ణయాలలో కచ్చితంగా మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాడు. అన్నికంటే మీ ఆనందానికి ముఖ్య ప్రాధాన్యతని ఇస్తాడు. మీరు నవ్వితే తాను సంతోషపడతాడు. అందుకోసం ఎంత కష్టమైనా పడతాడు. మీకోసం అనుకోకుండా పూలు తెచ్చినా.. మీకోసం వంట చేసినా.. మీకు అవసరమైన సమయంలో మీకు సౌకర్యవంతంగా ఉండేట్లు నడుచుకున్నా.. అవన్నీ మీ పెదవులపై చిరునవ్వు కోసమే అయి ఉంటాయి.
Advertisement
మీపై నిజంగా ప్రేమ ఉంటె అతను మీ స్వచ్చని, స్వతంత్రంగా మీరు తీసుకోవాలన్న నిర్ణయాలను గౌరవిస్తాడు. అలాగే కమ్యూనికేషన్ విషయంలో మీ వద్ద స్పష్టంగా ఉంటారు. తాను చెప్పాలనుకున్న విషయాలను, చేయాలనుకున్న పనుల గురించి మీ ముందు నిజాయితీగా తెలుపుతారు. నిజంగా మిమ్మల్ని తన జీవితంలోకి ఆహ్వానించాలని అనుకుంటే.. అతను మిమ్మల్ని తన కుటుంబానికి పరిచయం చేస్తాడు. అతను స్వచ్ఛంగా ప్రేమిస్తూ.. తన చేతల్లో ప్రేమని కనబరిస్తే.. ఆ ప్రేమ కచ్చితంగా మీ మనసుని తాకుతుంది. కాబట్టి మీరు ప్రేమించే వ్యక్తిని మీ మనసుతో చూడండి. కళ్ళతో కాదు. మీకే అన్ని అర్ధం అవుతాయి.
మరిన్ని..
మన దేశంలో విడాకులు పెరగడానికి ముఖ్య కారణాలు ఏంటి.. ఈ విషయాలు తెలిస్తే మైండ్ బ్లాక్..!
నారా బ్రాహ్మణిపై ఎమ్మెల్యే రోజా ఎందుకు ఇంతలా ఫైర్ అవుతున్నారు? అసలు కారణం ఏంటంటే?
స్కంద సినిమాలో రచ్చ లేపే ఆ పొలిటికల్ డైలాగ్స్ ని తీసేయడానికి అసలు కారణం ఏంటి?