Advertisement
వైయస్ జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలలో గెలుపు లక్ష్యంగా వున్నా, ఆయన ఇక వేసే ప్రతి అడుగు కూడా కీలకము అని అనుకుంటున్నారా..? ఎన్నికలకి ఆయన రెడీ అయ్యారా..? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే చెప్పాలి. ఎన్నికల ముందు టిడిపికి చెక్ పెట్టడానికి, జగన్ ప్లాన్ వర్క్ అవుట్ అయింది. సక్సెస్ ని సాధించారు. ఇక జగన్ సొంత పార్టీకి తిరుగులేదు అని అనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇందులో భాగంగా ఇటీవల పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు.
Advertisement
ఈ సమావేశంలో భాగంగా ఇంకొకసారి వైనాట్ 175ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలలో 175 స్థానాలలో విజయం సాధించడమే జగన్ లక్ష్యమని తెలుస్తోంది. పైగా గట్టిగా దీని కోసం ప్రయత్నం చేస్తే కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని కూడా అంటున్నారు. ప్రస్తుతం సర్వేల ప్రకారం చూసినట్లయితే అవన్నీ అనుకూలంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అలానే సీట్ల కేటాయింపు పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
Advertisement
ఈసారి చాలామందికి సీట్లు దక్కకపోవచ్చు అని సర్వేల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని కూడా జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీనితో సొంత పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలోనే కలవరం మొదలైంది. జగన్ చేయించిన సర్వేలో ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం ఉన్నట్లు నివేదికల ప్రకారం తెలుస్తోంది. దాంతో వాళ్ళందర్నీ పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని ఆ స్థానంలో పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అలానే జగన్ తన పాలనపై కూడా సర్వే నిర్వహించారు. దీనిపై కూడా సానుకూల స్పందన వచ్చింది. అందుకనే ఇంకొకసారి వైనాట్ 175 నినాదం ఎత్తుకున్నారని టాక్ వచ్చింది. కొన్ని జాతీయ సర్వ్ సంస్థలు నిర్వహించిన సర్వేలలో చూసినట్లయితే జగన్ పాలన పట్ల నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. ఈ ప్రకారం జగన్ విషయంలో సర్వేలు ఎలా తేల్చబోతున్నారనేది ఆసక్తికరంగా ఉంది. మరి జగన్ సర్వేల ఆధారంగా ఏపీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు అనేది తెలీదు చూడాల్సి ఉంది.
Also read:
- సీఎం కేసీఆర్ కి హ్యాట్రిక్ సాధ్యమేనా..? సర్వేలు ఏం చెబుతున్నాయంటే..?
- గుడిలో రజనీకాంత్.. బిచ్చగాడు అనుకొని మహిళ రూ.10 దానం! అసలు ట్విస్ట్ ఏంటంటే..?
- బిఆర్ఎస్ కు ఆంధ్ర సెటిలర్స్ దూరం అవుతున్నారా?