Advertisement
ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో పెద్దమలుపు చోటుచేసుకుంది. చంద్రబాబు అరెస్ట్ కి సంబంధించి రోజుకో విషయం బయటకు వస్తోంది చంద్ర బాబు బెయిల్ పై బయటికి వచ్చేస్తే బాగుంటుందనే టీడీపీ కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు. కానీ చంద్రబాబు మీద ఇంకొన్ని కేసులు నమోదు అవుతూ ఉంటున్నాయి. సో దీని ప్రకారం చంద్రబాబు రిలీజ్ అయ్యే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
Advertisement
ఇవి కూడా చదవండి: ఆ పత్రాలే చంద్ర బాబు భవిష్యత్తు ని తేల్చేది..? ఎందుకు అంటే..?
లోకేష్ ని కూడా త్వరలో అరెస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో లోకేష్ పేరుని ఇప్పటికే చేర్చారు. ఈ కేసులో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకి కూడా భారీగా లబ్ధి చేకూరిందని అనుమానాలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: లోకేష్ ఢిల్లీ లో ఏం చేస్తున్నారు..? సిఐడి అధికారులు పంపిన నోటీసులు.. అరెస్ట్ చేస్తారా..?
Advertisement
ఒకవేళ కనుక ఇదే నిజమని తెలిస్తే భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా జైలుకు వెళ్ళచ్చని అర్ధమవుతోంది. హెరిటేజ్ ఫుడ్స్ కి భారీగా లబ్ధి చేకూరే విధంగా టీడీపీ వ్యవహరించిందని తెలుస్తుంది. ఆ సంస్థకి మేనేజ్మెంట్ హోదాలో భువనేశ్వరి బ్రాహ్మణి ఉండడంతో వీళ్ళిద్దరికీ కూడా ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఒకవేళ కనుక ఇదే జరిగితే కచ్చితంగా చంద్రబాబు ఫ్యామిలీకి బాగా ఇబ్బంది కలుగుతుంది. 2024 ఎన్నికల దాకా టీడీపీకి ఇబ్బందులు వచ్చే విధంగా జగన్ సర్కార్ చూస్తోంది. చంద్రబాబు రిలీజ్ అవ్వకపోతే కచ్చితంగా పార్టీకి నష్టమే తెలివిగా సర్కార్ అడుగులు వేస్తోంది.
Also read: