Advertisement
చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఎపి రాజకీయ పరిమాణాలపై ఏపీ ప్రజల్లో చాలా సందేహాలే ఉన్నాయి. బాబుని అరెస్ట్ చేసిన విషయమై ఇప్పటివరకు బిజెపి రాష్ట్ర నాయకులూ గాని, అటు ఢిల్లీ పెద్దలు కానీ స్పందించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీ లోని బిజెపి పెద్దలు జగన్ పక్షాన నిలిచారా? అన్న అనుమానాలకు ఈ ప్రవర్తన మరింత ఆజ్యం పోస్తున్నట్లు ఉంది.
Advertisement
వీటిని కూడా చదవండి: ఎన్టీఆర్ మీద ఆ అనవసర కామెంట్స్ తో టీడీపీకి మరింత డ్యామేజ్ అవ్వనుందా ?
వీటిని కూడా చదవండి: ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్.. ఈ పర్యటన వెనుక అసలు కారణం చంద్రబాబు నాయుడు కేసులేనా?
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ తన స్పందనను తెలియచేసారు. అలాగే.. రాబోయే ఎన్నికల్లో కూడా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు కూడా ప్రకటన చేసారు. ఈ సారి ఎలక్షన్స్ లో జనసేన-టీడీపీ ప్రభుత్వమే అధికారం లోకి వస్తుంది అంటూ ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే.. ఈ పొత్తుకు బిజెపి కూడా ముందుకు వస్తుందని పవన్ భావించారు. కానీ, బాబు అరెస్ట్ పై బిజెపి మౌనం వహించడంతో వారు జగన్ పై ప్రేమ కురిపిస్తున్నారని పవన్ కు అర్ధం అయినట్లు ఉంది. మరో వైపు ఇప్పటివరకు బీజేపీ పెద్దలు బాబు అరెస్ట్ గురించి స్పానిదించకపోవడంపై కూడా పలు అనుమానాలకు తావిస్తున్నట్లు అవుతోంది.
Advertisement
వీటిని కూడా చదవండి: ఆ పత్రాలే చంద్ర బాబు భవిష్యత్తు ని తేల్చేది..? ఎందుకు అంటే..?
వారు బలమైన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ని దెబ్బకొట్టి సమయం చూసి ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే.. సీఎం జగన్ విజయం కోసమే బిజెపి ఎదురు చూస్తోందని తెలుస్తోంది. దీనితో పవన్ ఎన్డీయే అయితే… ప్రజల్లో సిబిఎన్ పట్ల సానుభూతి పెరగడం, పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకేసి టీడీపీ తో పొత్తు ప్రకటించడంతో బిజెపి ఇరుకున పడ్డట్లు అయ్యింది. ఇక పార్టీ అభిమతాన్ని దృష్టిలో పెట్టుకుని బాబు కూడా బిజెపితో పొత్తు పెట్టుకోకపోవచ్చని తెలుస్తోంది. ఎన్డీయే కూటమితో కలిసే విషయమై బాబు జైలు నుంచి విడుదల అయ్యాక చూసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
వీటిని కూడా చదవండి: భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా జైలుకు వెళ్తారా..? కేసు ప్రూవ్ అయితే…?