Advertisement
ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సి ఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్న సమయానికి సీఎం జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. అధికారిక ఎజెండాతోనే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారని తెలుస్తోంది. ఓ వైపు పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన, మరో వైపు రాష్ట్ర రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు పైన నమోదు అయిన కేసులను కేంద్రానికి అప్పగించే విషయమై చర్చలు జరుగుతున్నాయి.
Advertisement
వీటిని కూడా చదవండి: ఎన్టీఆర్ మీద ఆ అనవసర కామెంట్స్ తో టీడీపీకి మరింత డ్యామేజ్ అవ్వనుందా ?
వీటిని కూడా చదవండి: చంద్ర బాబు అరెస్ట్ తరువాత స్కంద సినిమాలో చేసిన మార్పులు ఇవేనా ?
Advertisement
ఈ విషయం గురించే సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారా? అన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఓ వైపు అసెంబ్లీ సెషన్స్, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలతో జగన్ ఢిల్లీ పర్యటన ఆలస్యమైంది. ఇప్పుడు ఢిల్లీ సమావేశాలకు జగన్ వెళ్తున్నారు. అయితే.. సి ఎం జగన్ ప్రధాని మోడీని కూడా కలవనున్నారని తెలుస్తోంది. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న చంద్రబాబు జనసేనాని పవన్ తో పొత్తు ప్రకటన వేళ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతని సంతరించుకుంది.
సి ఎం జగన్ ఢిల్లీ పర్యటన సమయంలో హోమ్ మంత్రితో ఈ కేసు బదలాయింపు గురించి చర్చ జరిగే అవకాశం ఉంది అంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటించడంపై బిజెపి పెద్దలు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.
వీటిని కూడా చదవండి: ఎన్డీయేకి గుడ్ బాయ్ చెప్పనున్న పవన్ కళ్యాణ్? త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారా?