Advertisement
సూపర్ స్టార్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా జైలర్. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరొందల కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది ఈ సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ తన డెబ్భై ఏళ్ల వయసులో కూడా నేటి కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ సినిమాను ఇప్పటికే చాలా మంది చూసేసారు. ఓటిటిలో కూడా ఈ సినిమా అందుబాటులోకి రావడంతో థియేటర్ రిలీజ్ అయినప్పుడు చూడని వాళ్ళు కూడా ఈ సినిమాను ఇప్పుడు చూసేస్తున్నారు.
Advertisement
అయితే.. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడానికి స్టోరీ, స్క్రీన్ ప్లే కీలక పాత్ర పోషించాయి. అయితే.. ఓ చిన్న పాయింట్ ను మాత్రం దర్శకుడు నెల్సన్ మర్చిపోయినట్లు ఉన్నారు. ఈ సినిమాలో కమెడియన్ యోగిబాబుది ఓ సన్నివేశం ఉంటుంది. ఇందులో యోగి బాబు హీరో రజినీకాంత్ కు హెల్ప్ చేయడానికి, విగ్రహాలను తరలించే వ్యక్తులను పట్టుకోవడానికి తన వంతు సాయం చేస్తాడు. అందులో యోగిబాబు కూడా ఒక విగ్రహాన్ని పట్టుకుని దారిన వచ్చే వాహనాలను ఆపి ఈ విగ్రహం పడిపోయింది మీదేనా? అని అడుగుతూ ఉంటాడు.
Advertisement
అలా వచ్చిపోయే లారీలను ఆపి అడుగుతూ ఉంటాడు. చాలా తమది కాదు అని వెళ్ళిపోతూ ఉంటారు. ఒకడు మాత్రం ఆగి తనకు తెలిసిన ఇతర డ్రైవర్లకు ఫోన్ చేసి మీ వెహికల్ లోంచి విగ్రహం ఏమైనా పడిపోయిందా అని అడుగుతాడు. దీనితో విగ్రహాలను దొంగతనంగా తరలించేది వారే అని అర్ధం చేసుకున్న హీరో వారి పని పడతాడు. కానీ, ఇక్కడ డైరెక్టర్ మర్చిపోయిన లాజిక్ ఏంటంటే.. ఏ వెహికల్ లో అయినా విగ్రహాలు పడిపోతే ఆ రోడ్ దాటిపోయాక తెలుస్తుంది. అంటే విగ్రహాలు వెనక నుంచి పడిపోతాయి తప్ప.. ఎదురుగ ఉన్న వ్యక్తి వచ్చి ఎలా అడుగుతాడు? ఇంత చిన్న లాజిక్ ను డైరెక్టర్ ఎలా మర్చిపోయారో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని..
ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు బోయపాటి గారు..? దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్..!
తెలుగింటి సంస్కృతి అన్న మ్యూజిక్ వీడియో కి 1 M వ్యూస్ ఘనంగా విజయోత్సవ వేడుకలు
నవంబర్ చివరి దాకా జైలులోనే ఉండనున్న చంద్రబాబు..? అన్ని రోజులు ఎందుకంటే?