Advertisement
రైల్వే స్టేషన్లలో, మీరు రైళ్ల స్టేటస్ మరియు ఇతర విషయాల గురించి అనౌన్స్మెంట్ల ద్వారా వింటూనే ఉంటారు. ఏదైనా రైల్వే స్టేషన్లో ప్రకటన వచ్చినప్పుడల్లా “యాత్రిగన్ కృప్యా ధ్యాన్ దే ” అంటే ‘ప్రయాణికులు దయచేసి శ్రద్ధ వహించండి’ అన్న అర్ధంతో ఒక అనౌన్సమెంట్ వినిపిస్తూ ఉంటుంది. ఈ అనౌన్సమెంట్ ను చదివిన వ్యక్తి గురించి మీరు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. రైల్వే స్టేషన్లలో వినిపించే ఈ స్వరం సరళ చౌదరి అనే ఓ మహిళది. 1982లో సరళా చౌదరితో సహా వందలాది మంది అభ్యర్థులు సెంట్రల్ రైల్వేలో అనౌన్సర్ పదవి కోసం ఇంటర్వ్యూ కు వెళ్లారు.
Advertisement
ఈ ఇంటర్వ్యూ లో సరళ చౌదరి సెలెక్ట్ అయ్యారు. అయితే ఆమె తాత్కాలిక ఉద్యోగిగా చేరింది. ప్రజల దృష్టిని ఆకర్షించడంలో సరళ స్వరం ప్రభావవంతంగా ఉందని రైల్వే సంస్థ భావించింది. ఆమె గొంతుకు ప్రయాణికులు ఆకర్షితులు అవ్వడం గమనించిన రైల్వే సంస్థ ఆమెను శాశ్వత ఉద్యోగిగా మార్చింది. ప్రయాణీకులు నిజంగా ప్రకటనకు శ్రద్ధ చూపడం ప్రారంభించినప్పుడు అంటే 1986 లో సరళ చౌదరి పర్మనంట్ ఎంప్లాయ్ గా నియమించబడ్డారు.
Advertisement
ఈ రోజు కూడా ఆమె ప్రీ-రికార్డ్ వాయిస్ దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఉపయోగించబడుతోంది. కొత్తగా వచ్చిన రైల్వే అనౌన్సమెంట్ కోసం వేరే వ్యక్తుల వాయిస్ ను ఆమె వాయిస్ మధ్యలో వినియోగిస్తూ వస్తున్నారు. సరళా చౌదరి ఈరోజు రైల్వేలో అనౌన్సర్ పదవిలో లేకపోవచ్చు, కానీ ఆమె స్వరం మాత్రం ఈరోజుకు కూడా పని చేస్తూనే ఉంది. ఆమె గొంతు ఇప్పటికీ ఇండియాలోని రైల్వే స్టేషన్లలో వినిపిస్తూనే ఉంటుంది.
మరిన్ని..
ప్రతిపక్షాలపై కొత్త అస్త్రం వెయ్యబోతున్న సీఎం జగన్.. ఇక నుంచి విశాఖ కేంద్రంగా..?
జైలర్ మూవీలో ఈ సీన్ గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?
ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు బోయపాటి గారు..? దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్..!