Advertisement
మనలో చాలా మంది నమ్మే విషయం ఏంటి అంటే గుమ్మానికి నిమ్మకాయలు, మిర్చి కలిపి కడితే దిష్టి దోషం ఉండదు అని అనుకుంటుంటారు. అలాగే.. ఎండు మిరప కాయలతో దిష్టి తీసి పడేస్తూ ఉంటారు. అయితే.. వీటిని కొంతమంది నిర్లక్ష్యంగా రోడ్డుపై పడేస్తూ ఉంటారు. రోడ్డుపై ఉన్న ఈ నిమ్మకాయ, మిర్చిని ఎవరైనా పొరపాటున తొక్కితే వారికి కూడా ఆ దిష్టి దోషం ప్రభావం ఉంటుందని నమ్ముతుంటారు. అసలు ఇవి ఎందుకు కడతారు, వాటిని పొరపాటున తొక్కితే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.
Advertisement
వీటిని కూడా చదవండి: అందంగా ఉందని ఆశపడ్డాడు.. ఎదురు కట్నమిచ్చి మరీ పెళ్లి చేసుకుంటే.. చివరికి..?
వీటిని కూడా చదవండి: ఈ 7 బిలియనీర్లు చేసిన మొట్ట మొదటి జాబ్ ఏంటో తెలుసా? అస్సలు నమ్మలేరు!
Advertisement
నిమ్మకాయలు, ఎండు మిర్చి ప్రతికూల శక్తులను అడ్డుకోవడం దారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి దోహదం చేస్తాయి. అందుకే ఇలా దిష్టి తీయడం కోసం పెట్టిన వాటిని తొక్కకూడదు అంటారు. దీంతో రోడ్డుపైనా, ఏదైనా కూడలిపైనా నిమ్మకాయ, మిర్చి పడి ఉన్నట్టు కనిపిస్తే.. దాని మీద అడుగు పెట్టకూడదని, దాటకూడదని కూడా అంటారు. ఎందుకంటే అది శుభప్రదం కాదు.
చెడ్డ దృష్టితో బాధపడే వ్యక్తి తన ఆస్తి రక్షణ కోసం దుకాణం మరియు ఇంటి ప్రధాన తలుపుకు నిమ్మకాయ మరియు మిరపకాయను కట్టుకుంటాడు, ఇలా చేస్తే ప్రతికూల ప్రభావాలు దాటిపోతాయి. రోడ్డుపై పడి ఉన్న నిమ్మకాయ, మిరపకాయలపై కాళ్లు పెడితే నిమ్మకాయను విసిరేవాడికి కష్టాలన్నీ అవతలి వ్యక్తిపైకి వెళ్తాయి. ఈ కారణంగా, చెడు చూపు మరియు ప్రతికూల శక్తి ప్రభావం ఆ వ్యక్తిపై రావడం ప్రారంభమవుతుంది. అందుకే రోడ్డుపై పడి ఉన్న వాటిని తొక్కకూడదు. అలానే.. మన ఇంటికి లేదా దుకాణానికి కట్టిన వాటిని కూడా దూరంగా ఎవ్వరూ తిరగని చోట విసిరివేయాలి.
మరిన్ని..
రైల్వే స్టేషన్లలో వినిపించే అనౌన్సమెంట్ల గొంతు ఎవరిదో తెలుసా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?