Advertisement
మొన్నటి తరం స్టార్ హీరో అక్కినేని నాగేశ్వర్రావు గురించి ప్రత్యేకించి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్కు తీసుకొచ్చిన ఘనత అక్కినేని నాగేశ్వరరావుకే దక్కుతుంది. ఏఎన్ఆర్ 60వ దశకంలో మద్రాసు వదిలి హైదరాబాద్ వచ్చారు. అప్పట్లో టాప్ హీరో. అలాగే తన సినిమాలన్నీ హైదరాబాద్ లోనే షూట్ చేయాలని అనుకున్నాడు. అయితే చాలా మంది నిర్మాతలకు అది నచ్చలేదు. ఏఎన్ఆర్ చేసింది పెద్ద తప్పు అని అందరూ అనుకున్నారు.
Advertisement
మరికొందరు సినిమాలు లేకుంటే ఏఎన్ఆర్ నష్టపోతారని అనుకున్నారు. కానీ ఏఎన్ఆర్తో సినిమాలు తీసే నిర్మాతలు మాత్రం హైదరాబాద్కి వెళ్లి మరీ షూటింగ్లు చేసేవారు. ఇలా 60వ దశకం నుంచి అక్కినేని సినిమాల షూటింగ్ సారధి స్టూడియోస్ లో విరివిగా జరిగేది. ఆ తరువాత అక్కడ కూడా షూటింగ్ జరగడానికి అనుమతి దొరకలేదు. దీనితో మహాకవి క్షేత్రయ్య సినిమాకు బెంగళూర్ వెళ్లి షూటింగ్ చెయ్యాల్సి వచ్చింది. ఆ టైం లోనే ఏఎన్నార్ తనకంటూ ఓ స్టూడియో ఉండాలి అని అనుకుని అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
Advertisement
అయితే.. ఈ స్టూడియో వచ్చాక సినిమా షూటింగ్స్ ఎక్కువగా హైద్రాబాదులోనే జరిగేవి. అయితే.. ఈ స్టూడియోలోకి ఓ సారి అక్కినేని నాగేశ్వర్రావు ను రానివ్వలేదట. ఎందుకంటే ఆ స్టూడియోకి ఉన్న వాచ్ మాన్ నేపాలీ వ్యక్తి. తెలుగు వాళ్ళని సెక్యూరిటీగా పెడితే.. ప్రజలు వారికి ఎదో ఒకరకంగా నచ్చ్చచెప్పి స్టూడియో లోపలకి వచ్చేస్తున్నారని.. అసలు భాష తెలియని నేపాలీ వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. అతనికి ఏఎన్నార్ ఎవరో తెలియకపోవడంతో లోపలకి అనుమతించలేదు. ఏఎన్నార్ తానె ఓనర్ ని అని చెప్పినా ఆ వ్యక్తి నమ్మలేదట. చివరకు లోపల సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి అనుకోకుండా బయటకు వచ్చి.. ఆ వాచ్ మాన్ కి ఫోటో చూపించి ఆయనే ఓనర్ అని చెప్పడంతో అప్పుడు లోపలకి పంపారట. అప్పటికి ఆ వాచ్ మాన్ జీతం ఐదు వందల రూపాయలు ఉండేది. అతను సిన్సియర్ గా పని చేస్తున్నాడు అని తెలియడంతో అతని జీతం ఏడూ వందల రూపాయలు చేశారట.
మరిన్ని..
పొరపాటున రోడ్డుపై ఉన్న దిష్టి మిరపకాయలు, నిమ్మకాయలు తొక్కితే ఏమి జరుగుతుందో తెలుసా?
అందంగా ఉందని ఆశపడ్డాడు.. ఎదురు కట్నమిచ్చి మరీ పెళ్లి చేసుకుంటే.. చివరికి..?
ఈ 7 బిలియనీర్లు చేసిన మొట్ట మొదటి జాబ్ ఏంటో తెలుసా? అస్సలు నమ్మలేరు!