Advertisement
ఏపీ సర్కార్ పై ఏపీ బిజెపి అధ్యక్షురాలు ఫైట్ చేయడానికి సిద్ధం అయ్యారు. ఏపీలో జరుగుతున్నా మద్యం అమ్మకాలపై ఆమె తన పంజా విసిరారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఎన్నికైన పురంధేశ్వరి వైసీపీతో పాటు టీడీపీ పై కూడా పోరాటం చేస్తానని ప్రకటన చేసారు. కానీ ఆమె వైసీపీ ని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తరువాత ఆమె వైసీపీ మద్యం అమ్మకాల గురించి మాట్లాడుతూ వస్తున్నారు. మొన్న ఓ దుకాణానికి వెళ్లి అక్కడ జరుగుతున్నా మద్యం బాటిళ్ల అమ్మకం గురించి ఆరా తీశారు.
Advertisement
మద్యం అమ్మకాలన్నీ నగదు లావాదేవీలపైనే జరగడాన్ని ఆమె తప్పుబట్టారు. ఏడాదికి పాతిక వేల కోట్లకు పైగా సొమ్ము పక్క దారి పడుతోందని ఆరోపించారు. ఈ అవినీతి సొమ్మంతా వైసీపీ నేతల వద్దకే చేరుతోందన్నారు. సీఎం జగన్ నుంచి దిగువ స్థాయిలో ఉన్న నేతలు కూడా ఇందులో భాగస్వాములే అంటూ ఆమె ఆరోపణలు చేసారు. గత నెల రోజులుగా కేవలం మద్యం విధానాలపైనే కామెంట్స్ చేసిన ఆమె.. ఇటీవల నేరుగా కేంద్రమంత్రి అమిత్ షా ను కలిశారు. ఏపీ సర్కార్ మద్యం పాలసి పై సిబిఐ విచారణకు ఆదేశించాలి అంటూ ఆమె అమిత్ షా ను కోరారు. మద్యం అమ్మకాల కోసం గతంలో షాపుల అనుమతికి వేలం వేసేవారని.. కానీ ఇప్పుడు మద్యం అమ్మకాలన్నిటినీ ప్రభుత్వమే చేస్తోందని.. అందులోనూ నూటికి ఎనభై శాతం నగదు లావాదేవీలే జరుగుతున్నాయని అన్నారు. ఎక్కువ మొత్తంలో మద్యం సొమ్ముని ప్రభుత్వ నేతలే తీసుకుంటున్నారని ఆరోపించారు.
Advertisement
అలాగే.. నాణ్యమైన మద్యాన్ని విక్రయించడం లేదని, చీప్ మందు బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని అపి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. మద్యం వ్యాపారంలో కోట్లల్లో లాభం వస్తోన్న.. ఇది వైసీపీ నేతల చేతుల్లోకి వెళుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం ఫోకస్ చేస్తే.. అవినీతి అంతం చేయవచ్చని ఆమె అన్నారు. దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
మరిన్ని..
ఒకవేళ చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదల అయినా.. తర్వాత ఏమి జరుగుతుందంటే?