Advertisement
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. సిబిఎన్ అరెస్ట్ తో రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది అన్న విషయంలో కూడా లెక్కలు మారాయి. అసలు ఈ విషయమై ప్రజలు ఎలా భావిస్తున్నారు? ఎవరు ఏ పార్టీకి తమ సపోర్ట్ ని ఇస్తున్నారు అన్న విషయం తెలుసుకోవడానికి కొన్ని సర్వే సంస్థలు కంకణం కట్టుకున్నాయి.
Advertisement
టాప్ మీడియా సంస్థ ‘టైమ్స్ నౌ’ ఎన్నికలలో వైసీపీ నే లోక్ సభలో 25 స్థానాలకు గాను.. 24 స్థానాలను సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. మరో ప్రాముఖ్య మీడియా సంస్థలు ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ కలిసి జరిపిన సర్వేలో వైసీపికి 7 సీట్లు తగ్గే అవకాశం ఉందని.. అవి టీడీపీకే సొంతం అవుతాయని అంది. కాంగ్రెస్, బిజెపి పార్టీలు బలహీన పడతాయని పేర్కొంది.
Advertisement
బాబు అరెస్ట్ తో వైసీపీ గ్రాఫ్ పడిపోతుందని.. ఇప్పటికప్పుడు ఎన్నికలు పెడితే.. వైసీపీ కి 15 టీడీపీకి 10 ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటి సర్వే ప్రకారం.. టీడీపీకి 42 శాతం ఓట్లు వస్తే.. వైసీపికి 46శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందు వెనుకా, ఆలోచించుకోకుండా వైసీపీ ప్రభుత్వం బాబుని అరెస్ట్ చెయ్యడం వలన టీడీపీ కి సానుభూతి ఓట్లు పెరిగాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరో వైపు టీడీపీ జనసేన పార్టీల పొత్తు కూడా కుదరడానికి ఓ రకంగా బాబు అరెస్ట్ కారణం అయ్యింది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ఒకవేళ చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదల అయినా.. తర్వాత ఏమి జరుగుతుందంటే?