Advertisement
తెలుగు ఇండస్ట్రీకే ఒక పెద్దల, గౌరవప్రదమైన హోదా లో కొనసాగుతున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే ఆయనే చిరు. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి, ఇంతటి ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు. అలాంటి హీరో చిరు తన పెళ్లి సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవేంటో మీరు కూడా తెలుసుకోండి..? స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చిరంజీకీ అప్పట్లో అల్లు రామలింగయ్య తన కూతురును ఇవ్వాలని భావించిన సమయంలో నేరుగా చిరంజీవి ని కలవకుండా ఆయన పని చేసే డైరెక్టర్ల దగ్గరికి వెళ్లి చిరంజీవి గురించి సెర్చ్ చేశారట. ఆయన గురించి తెలుసుకోమని అల్లు రామలింగయ్య అరవింద్ కు చెప్పారట. మొదటిసారి పున్నమినాగు ప్రివ్యూ థియేటర్లో చిరంజీవిని కలిశారట అల్లు అరవింద్. దీంతో చిరంజీవి చెప్పండి సార్ అంటూ వినయంగా మాట్లాడరట. నీతో మాట్లాడాలని నాన్నగారు పంపారని అరవింద్ చెప్పారట. ఇద్దరి మధ్య మాటలు కలిశాయట.
Advertisement
Also Read: “పూరి జగన్నాథ్” ఆలయం గురించి ఈ 4 విషయాలు మీకు తెలుసా..?
మా సురేఖను నీకు ఇచ్చి చేద్దామని అనుకుంటున్నాము నీకు ఇష్టమేనా అని అడిగేస్తారు. దీంతో చిరంజీవి మొదట కాస్త ఆశ్చర్యానికి గురై తర్వాత ఇష్టమే అని చెప్పారట. తర్వాత సురేఖ తన బిల్డింగ్ పై నుంచి చూస్తే చిరంజీవి అద్దెకు ఉండే రూమ్ కనిపించేదట. అలా ఇద్దరి మధ్య చూపులు కలిసాయి. అయితే ఒకరోజు సురేఖ రామలింగయ్య వద్ద అతను అంతగా స్టైల్ గా లేడని అన్నదట, దీనికి రామలింగయ్య స్టైల్ ఏమో కానీ అతని యాక్టింగ్ చాలా బాగుందని, ఫ్యూచర్ లో చాలా పెద్ద యాక్టర్ అవుతారని సమాధానం ఇచ్చారట.
Advertisement
ఇక పెళ్లి ముహూర్తం దగ్గరికి రానే వచ్చింది. 1980 ఫిబ్రవరి 20న ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ వార్త అప్పట్లో సెన్సేషనల్ అయింది. చిన్న చిన్న పాత్రలు చేసే వ్యక్తికి అల్లు రామలింగయ్య తన కూతురిని ఇస్తున్నాడని ఇండస్ట్రీలో కొంత మంది నెగిటివ్ గా కూడా మాట్లాడారట. అయినా ఎక్కడో చిరంజీవి లో స్పార్క్ ఉందని అల్లురామలింగయ్య కి గట్టి నమ్మకం. ఇంకా పెళ్లి కి అన్నీ రెడీ అయ్యాయి. తీరా పెళ్లి సమయానికి నూతన్ ప్రసాద్ ఒక చిక్కు పెట్టాడు. అదే రోజున నూతన ప్రసాద్ తో చిరంజీవికీ కొన్ని సీన్లు ఉన్నాయి.
అది తాతయ్య ప్రేమ లీలలు మూవీ. ఆ రోజు నూతన ప్రసాద్ మిస్ అయ్యారంటే మళ్లీ నెల వరకు దొరకడు. ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పాడట నూతన్ ప్రసాద్. దీంతో చిరంజీవి ఏం చేయాలో అర్థం కాలేదు. పెళ్లి వద్దనే ధైర్యం లేదు. దీంతో ఏం చేయాలో చిరంజీవి కి అర్థం కాలేదు, వెంటనే అల్లు అరవింద్ పరిస్థితి అర్థం చేసుకొని షూటింగ్ జరిగే స్పాట్ కి దగ్గరలోనే పెళ్లి ఏర్పాట్లు చేసారట. చిరంజీవి ముందుగా వెళ్లి షూటింగ్ పూర్తి చేశారు. షూటింగ్ సమయంలో ఏ చొక్కా అయితే వేసుకున్నారో, అదే చొక్కా తో చిరంజీవి పెళ్లికి వచ్చేసారు. ఆ చొక్కా కాస్త మోచేతి వద్ద, చిరిగి ఉంది. తాళి కట్టే సమయంలో చిరంజీవి పైకి లేవగానే మరీ చిరిగిన చొక్కా వేసుకున్నారేంటి అన్నారు అందరూ. దీంతో చిరంజీవి చొక్కా చిరిగితే తాళి కట్టలేనా అని డైలాగ్ వేశారట. ఈ విధంగా వారి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత దాదాపు పదేళ్లలో ఆయన పెద్ద హీరో గా మారారు. ఇక మరో పదేళ్లలో ఇండస్ట్రీకి పెద్ద స్టార్ అయిపోయారు.
ALSO READ: ఎన్టీఆర్ కంటే ముందే రాజకీయాల్లో చక్రం తిప్పిన తెలుగు నటుడు ఎవరో తెలుసా?